సునిశిత్ ని పోలీసులు అరెస్ట్‌ చేశారు

Published: Thursday July 23, 2020

 à°ªà±à°°à°®à±à°– హీరోయిన్లు తన లవర్స్ అంటూ హంగామా చేస్తున్న సునిశిత్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. హీరోయిన్‌à°² పేరుతో  సునిశిత్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాడు. హీరోయిన్ల పరువు ప్రతిష్టలతో ఆటలాడుకుంటున్న సునిశిత్‌పై రాచకొండ కమిషనరేట్‌లో రెండు కేసులు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం, కీసర పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదుచేశారు. దీంతో పోలీసులు సునిశిత్‌ని అరెస్టు చేశారు. ప్రముఖ హీరోయిన్లు తన లవర్స్ అంటూ యూట్యూబ్ ఛానల్స్‌కు నిందితుడు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు హీరోయిన్లపై సునిశిత్ వ్యక్తిగత ఆరోపణలు చేశాడు. హీరోయిన్ల వ్యక్తిగత విషయాలను బహిరంగ పరిచి సునిశిత్  వేధింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది. హీరోయిన్లపై అసభ్య పదజాలం ఉపయోగిస్తూ సునిశిత్ ఇంటర్వ్యూలు ఇచ్చినట్లు పోలీసులు విచారణలో తేలింది.