కరోనా కేసుల్లో ఆరోగ్యశ్రీ తంతు

Published: Monday July 27, 2020

‘‘కరోనాకు ఆరోగ్యశ్రీలో ఉచితంగా చికిత్స చేస్తాం. బాధితులు రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు’’ అని ప్రభుత్వం జీవో 77, 78లను జారీ చేసింది. కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చడం బాగానే ఉన్నా, à°† బాధితులను చేర్చుకునే ప్రైవేటు ఆస్పత్రులు మాత్రం రాష్ట్రంలో కనిపించడం లేదు. ఏ కార్పొరేట్‌ ఆస్పత్రి మెట్లు తొక్కబోయినా ‘బెడ్‌ కావాలంటే డబ్బు చెల్లించు’ అన్నదే వినిపించే మాట. చెస్ట్‌ ఎక్స్‌రే దగ్గర నుంచి సీటీ చెస్ట్‌ స్కాన్‌ వరకూ ఇవి రూ.వేలు పిండుతున్నాయి. దొరికిందే అదునుగా మరికొన్ని ప్రైవేటు ఆస్పత్రులు రోజులవారీగా ప్యాకేజీలు నిర్ణయించి బిల్లు బాదేస్తున్నాయి. తక్కువలో తక్కువ రోజుకు 3 వేల నుంచి రూ.30 వేల వరకూ à°ˆ ప్యాకేజీలు ఉంటున్నాయి. ఇది ఉన్నతాధికారుల దగ్గర నుంచి ఉద్యోగుల వరకూ అందరికీ తెలిసినా మనకెందుకన్న చందంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ప్రకటనలతో కరోనాకు అన్ని ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం చేస్తున్నారన్న భ్రమలో చాలా మంది బాధితులు, రిపోర్టులో పాజిటివ్‌ అని తెలియగానే ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. వారు తీసుకెళ్లిన రిపోర్టులు చూడకుండానే.. ‘సారీ.. పాజిటివ్‌ కేసులను చూడటం లేదు’ అని యాజమాన్యం ముఖం మీదే చెప్పేస్తోంది. ఎంతైనా  చెల్లిస్తామన్న వారినే ఉండనిచ్చి, మిగతా బాధితులను పంపించివేస్తోంది. చేరిన రోజు నుంచీ పిండటమే పని. తొలిరోజు చెస్ట్‌ ఎక్స్‌రే, సీటీ చెస్ట్‌ స్కాన్‌ చేయించమంటారు. à°ˆ రెండు పరీక్షల్లో ఏమైనా తేడా వస్తే వెంటనే పంపించేస్తున్నారు. ఇక్కడా కాసులే మాట్లాడతాయి.

 

‘ఎంతైనా బిల్లు కడతాం’ అన్నవారిని వడపోసి.. మిగతావారిని చాలా ప్రైవేటు ఆస్పత్రులు పంపించివేస్తున్నాయి.. సరేనని వారు ప్రైవేటు ఆస్పత్రులు చేసిన టెస్టుల రిపోర్టులు పట్టుకొని పోతే ప్రభుత్వాసుపత్రుల్లోనూ చేర్చుకోవడం లేదు. ఇవి పాజిటివ్‌ అని తేల్చడానికి పనికిరావంటూ అక్కడా తలుపులు మూసేస్తున్నారు. ఇలా రోజూ వందల మంది రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంత మంది అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు పొగొట్టుకుంటున్న ఉదంతాలెన్నో!