హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు..

Published: Tuesday July 28, 2020

 ‘అమర రాజా’ కంపెనీకి కేటాయించిన భూముల్లో కొంత భాగాన్ని వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు నిలుపుదల చేసింది. à°ˆ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం కొత్తపల్లిలో సర్వే నంబరు 1/1బీ, బంగారుపాళ్యం మండలం నూనెగుండ్లపల్లిలోని సర్వే నంబరు 65/1లలో ‘అమర రాజా ఇన్‌ఫ్రా’ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు కేటాయించిన 483.27 ఎకరాల్లో 253.61 ఎకరాలను వెనక్కి తీసుకునేందుకు వీలుగా  పరిశ్రమలశాఖ à°—à°¤ జూన్‌ 30à°¨ జీవో 33ను జారీ చేసింది. అయితే, అక్కడ ఒప్పందంలో పేర్కొన్న దానికి మించే (రూ.2700 కోట్లు) పెట్టుబడులు పెట్టామని, ఎక్కువ మందికే ఉద్యోగాలు కల్పించామని, నిబంధనల మేరకే నడుచుకున్నామని అమర రాజా సంస్థ కోర్టుకు విన్నవించింది.

 

à°ˆ వివరణను ప్రాథమికంగా పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ప్రభుత్వ జీవోను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రతివాదులను ఆదేశించింది. à°ˆ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ à°¡à°¿.రమేశ్‌ సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీఐఐసీ చిత్తూరులో తమకు కేటాయించిన భూములకుసంబంధించి గతంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు, నిబంధనలకు అనుగుణంగా తాము నడుచుకుంటున్నా, రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశంతో à°† భూముల్ని వెనక్కి తీసుకోవాలని ఏపీఐఐసీని ఆదేశించిందని పేర్కొంటూ అమర రాజా సంస్థ ప్రతినిధి అంజనీ కిశోర్‌ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇటీవల à°ˆ వ్యవహారంపై విచారణ జరగ్గా.. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. 2009లో ఆయా భూములను రాష్ట్ర ప్రభుత్వం ఏపీఐఐసీకి విక్రయించగా, దాని వద్ద అమరరాజా కొనుగోలు చేసిందని, దీనికి సంబంధించిన పక్కా దస్తావేజులు తమ వద్ద ఉన్నాయని వివరించారు.