అంబాలా స్థావరంలో దిగిన రాఫెల్

Published: Wednesday July 29, 2020

ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు ఇవాళ హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరంలో ల్యాండ్ అయ్యాయి. దాదాపు 7 వేల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన à°ˆ తొలిబ్యాచ్... ఇక్కడ జరిగే à°“ అధికారిక కార్యక్రమం అనంతరం భారత వాయుసేన అమ్ములపొదిలో చేరనున్నాయి. మధ్యాహ్నం 3:31 సమయంలో విమానాలు ల్యాండ్ కాగానే సంప్రదాయం ప్రకారం వాటర్ సెల్యూట్ ఇచ్చారు. భారత్-పాకిస్తాన్ సరిహద్దుకు 220 కిలోమీటర్ల దూరంలో అంబాలా వైమానిక స్థావరం ఉంది. కాగా సోమవారం ఫ్రాన్స్ నుంచి బయల్దేరిన రాఫెల్ విమానాలు... దాదాపు ఏడు à°—à°‚à°Ÿà°² ప్రయాణం తర్వాత తొలుత యూఏఈలోని à°“ ఫ్రాన్స్ వైమానిక స్థావరంలో దిగాయి. నిన్న 30 వేల అడుగుల ఎత్తులో ఫ్రాన్స్ ట్యాంకర్ నుంచి రాఫెల్ విమానాలు గాల్లోనే ఇంధనం నింపుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్రాన్స్‌à°•à°¿ చెందిన దసాల్ట్ ఏవియేషన్ సంస్థ నుంచి మొత్తం 36 రాఫెల్ విమానాల కోసం భారత్ రూ.59 వేల కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.