ఇన్‌చార్జిల పాలనలో సగం యూనివర్సిటీలు

Published: Wednesday July 29, 2020

వీలైనంత త్వరగా వీసీలను నియమిస్తే వ్యవస్థ సజావుగా సాగుతుంది. కానీ.. వైసీపీ అధికారంలోకొచ్చి ఏడాది దాటినా సగం వర్సిటీలకు వీసీలను నియమించకుండా ఇన్‌చార్జిలతోనే à°•à°¾ లయాపన చేస్తోంది. అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా సీఎం జగన్‌ ‘మన పాలన-మీ సూచన’ పేరుతో ప్రజలకు మరింత చేరువ కావడానికి ఏం చేయాలో నేరుగా సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. కానీ విశ్వవిద్యాలయాలను మాత్రం పట్టించుకోవడం లేద ని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో విశ్వవిద్యాలయాల వ్యవస్థ మరింత దిగజారిపోయిందని వాపోతున్నారు. కరోనాను సాకుగా చూపి ఇన్‌చార్జిలను కొనసాగిస్తుండటాన్ని పలువురు తప్పుబడుతున్నారు. మార్చి తర్వాత కరోనా విజృంభిస్తే.. మరి అంతకుముందు రెగ్యులర్‌ వీసీలను నియమించకుండా ఎందుకు కాలక్షేపం చేశారని ప్రశ్నిస్తున్నారు. ఇన్‌చార్జి వీసీల పాలనలో పలు వర్సిటీల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

ఉన్నత విద్యాశాఖ ఏర్పాటు చేసిన చక్రపాణి కమిటీ.. వర్సిటీలకు ఇన్‌చార్జి వీసీలుగా ఐఏఎస్‌ అధికారులను నియమించరాదని సిఫారసు చేసింది. వీటిని అమలు చేయాలని ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖను ఆదేశించింది. కానీ.. విచిత్రం ఏమిటంటే కమిటీ సిఫారసులకు విరుద్ధంగా ప్రభుత్వం.. శ్రీవెంకటేశ్వర (తిరుపతి), శ్రీకృష్ణదేవరాయ (అనంతపురం), రాయలసీమ (కర్నూలు), టంగుటూరి ప్రకాశం (ఒంగోలు) వర్సిటీలకు ఐఏఎస్‌ అధికారులను ఎఫ్‌ఏసీ వీసీలుగా నియమించింది. ఆంధ్ర, ఆచార్య నాగార్జున వర్సిటీలకు సీనియర్‌ ప్రొఫెసర్లను ఇన్‌చార్జిలుగా నియమించింది. ద్రవిడ వర్సిటీకి అక్కడి రిజిస్ట్రార్‌నే ఇన్‌చార్జిగా ఏర్పాటు చేసింది. తెలు గు వర్సిటీ, గురజాడ అప్పారావు(విజయగరం) వర్సిటీలకైతే ఇన్‌చార్జిలను కూడా నియమించలేదు. అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీకి కేవలం రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ని ఓఎ్‌సడీగా నియమించింది. 

 

ఇన్‌చార్జి వీసీలు నిర్ణయాలు తీసుకోలేని ఫలితంగా వర్సిటీల్లో ఎక్కడిక్కడ పరిశోధనలు ఆగిపోతున్నాయి. పీహెచ్‌à°¡à±€ సబ్మిషన్‌, వైవావోస్‌, నోటిఫికేషన్‌లలో జాప్యం జరుగుతోంది. ఎస్వీయూ, రాయలసీమ వర్సిటీల్లో రిసెర్చ్‌లు వెనక్కు పోయినట్లు సమాచారం. అలాగే వర్సిటీల్లో అకడమిక్‌ షెడ్యూల్‌, ఎగ్జామినేషన్‌ షెడ్యూల్‌ ఖరారు చేయలేదు. చట్టాలు, ప్రభుత్వ ఉత్తర్వులపై అవగాహన లేకుండా, పాలకమండళ్ల రద్దు వంటి తొందర పాటు చర్యలు, సెర్చ్‌ కమిటీలకు వర్సిటీ నామినీ కోసం కోరం లేకుండా ఒకసారి, కోరంతో ఒకసారి పాలకమండళ్ల సమావేశాలు, సెర్చ్‌ కమిటీల ఉత్తర్వుల విడుదల వంటివి వివాదాస్పదమయ్యాయి.