కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్ తిరస్కరణ

Published: Thursday July 30, 2020

 à°Ÿà±€à°¡à±€à°ªà±€ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్‌ను జిల్లా కోర్టు తిరస్కరించింది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. మచిలీపట్నం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మోకా భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్ర ఏ4 నిందితుడిగా ఉన్నారు. కొల్లు రవీంద్ర ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఇప్పటికే.. ఈఎస్‌ఐ వైద్యసేవల కాంట్రాక్టు వ్యవహారంలో అరెస్టయిన రాష్ట్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత కె.అచ్చెన్నాయుడు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.

 

à°ˆ వ్యవహారంలో దర్యాప్తు కోసం మరింతమందిని అరెస్టు చేయాల్సి ఉందని, అందువల్ల అచ్చెన్నాయుడికి బెయిల్‌ ఇవ్వరాదంటూ ఏసీబీ చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు... ఆయన బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. à°ˆ మేరకు జస్టిస్‌ à°Žà°‚.వెంకటరమణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అచ్చెన్నాయుడు కార్మికశాఖ మంత్రిగా  ఉన్నప్పుడు కుదిరిన వైద్యసేవల కాంట్రాక్టులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో à°—à°¤ నెలలో ఏసీబీ అధికారులు ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.