తల్లిదండ్రులు, పిల్లల అభిప్రాయాలు తీసుకున్నాం

Published: Friday July 31, 2020

ఇప్పటికీ ఇంగ్లీషు మీడియం స్కూళ్లకే కట్టుబడి ఉన్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానంపై ఆయన స్పందించారు. గురువారం రాష్ట్ర ఉన్నత విద్యామండలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్‌సీఈఆర్‌à°Ÿà±€ మార్గదర్శకాలను పరిగణనలోనికి తీసుకొనే తాము విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పారు. 97శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లీషు మీడియం కావాలన్నారన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు గ్రామం నుంచి కూడా ఇంగ్లీషు మీడియం కావాలని తీర్మానం చేశారన్నారు. ‘జాతీయ విద్యా విధానం ప్రకారం తెలుగు భాష ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో కూడా రావాల్సి ఉంది. ప్రజలను తప్పుదోవ పట్టించరాదు. నూతన పాలసీని అడ్డుపెట్టుకొని ప్రభుత్వ నిర్ణయాన్ని నిలువరించాలనుకుంటే ఎలా?’ అని ప్రశ్నించారు. à°ˆ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందని, అందుకే ఇంతకు మించి మాట్లాడలేకపోతున్నానని చెప్పారు.

 

à°ˆ పాలసీలో పొందుపరిచిన అంశాల్లో సంస్థాగత మార్పులతోపాటు పలు సూచనలు చేశారని చెప్పారు. డ్రాఫ్టు పాలసీపై కేంద్రానికి తమ అభిప్రాయాలు చెప్పామని, ఇందులోని చాలా అంశాలు సీఎం ఆలోచనలను ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు.. జాతీయ విద్యా విధానంలోని చాలా అంశాలను తాము ఇప్పటికే అమలు చేశామని చెప్పారు. ‘ముందుగా రాష్ట్రంలోనే మానవ వనరులశాఖను విద్యాశాఖగా పేరు మార్చాం. ఇప్పుడు కేంద్రంలోనూ మార్చారు. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీప్రైమరీ స్కూళ్లుగా మార్చాలని,  6-8 తరగతులకుడిజిటల్‌ ఎడ్యుకేషన్‌, కోడింగ్‌, కంప్యూటర్‌ ఎడ్యుకేషన్‌ను ప్రారంభించాలని తొలుత మేం నిర్ణయించగా, అదే ఇప్పుడు కేంద్రం చెబుతోంది.

 

డిగ్రీ కోర్సుల్లో సీబీసీఎస్‌ à°•à°¿à°‚à°¦ ఆన్‌ జాబ్‌ ట్రైనింగ్‌కు సీఎం ఇప్పటికే ఆదేశించగా కేంద్రం à°ˆ విషయాన్ని కూడా తమ పాలసీలో పెట్టింది. నాలుగేళ్ల డిగ్రీ పాలసీ రావాలని, కోర్సులను ఫ్లెక్సిబిలిటీ ఉండేలా సీఎం ముందుగానే సూచించారు. మేం ఇచ్చిన సూచనలు, సలహాలు నూతన విద్యా విధానంలో పొందుపరిచారు. అమ్మ à°’à°¡à°¿ కార్యక్రమాన్ని, ఇండియన్‌ ఎడ్యుకేషన్‌ సర్వీ్‌సను మేం సూచించగా పాలసీలో పొందుపరిచారు’ అని చెప్పారు.