మాజీమంత్రి మాణిక్యాలరావు కన్నుమూత

Published: Saturday August 01, 2020

బీజేపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి à°ªà±ˆà°¡à°¿à°•à±Šà°‚à°¡à°² మాణిక్యాలరావు (60) మృతిచెందారు. నెలరోజుల కిందట ఆయకు కరోనా పాజిటివ్‌à°—à°¾ తేలడంతో అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. à°ˆ క్రమంలోనే à°¶à°¨à°¿à°µà°¾à°°à°‚ విజయవాడలోని ప్రైవేటు à°†à°¸à±à°ªà°¤à±à°°à°¿à°²à±‹ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిశారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం à°¨à°¿à°¯à±‹à°œà°•à°µà°°à±à°—à°‚ నుంచి విజయం సాధించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దేవాదాయశాఖ à°®à°‚త్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1989లో బీజేపీలో చేరిన ఆయన పార్టీ అభివృద్ధి కోసం పని చేసి.. చివరి వరకూ అదే పార్టీలో కొనసాగారు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

1989లో బీజేపీలో చేరిన ఆయన పార్టీ అభివృద్ధి కోసం పని చేశారు.  à°œà°¿à°²à±à°²à°¾à°¸à±à°¥à°¾à°¯à°¿ నాయకుడి నుంచి  à°®à°‚త్రి స్థాయి వరకు అంచెలంచెలుగా మాణిక్యాలరావు ఎదిగారు. నేటి రాజకీయాల్లో విలువలతో తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. 

పార్టీని నమ్ముకుని పార్టీ కోసం పని చేసిన వారి పదవులు వస్తాయని  à°šà±†à°ªà±à°ªà±‡à°‚దుకు మాణిక్యాలరావు ఉదాహరణ. దేవదాయ శాఖ మంత్రిగా రాష్ట్రంలోని అనేక ఆలయాలు అభివృద్ధికి తన వంతు కృషి చేశారు. మాణిక్యాలరావు కుటుంబ సభ్యులకు బీజేపీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం.


బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ రాష్ట్ర మంత్రి, స్నేహ శీలి, ఆప్త మిత్రులు మాణిక్యలరావు చికిత్స పొందుతూ అకాల మరణం చెందారు. ఇది మా పార్టీ శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు అత్యంత బాధాకర పరిణామం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియ చేస్తున్నాను. ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. ఆయన మరణం బీజేపీ కార్యకర్తలకు, అభిమానులకు తీరని లోటుగా చిరకాలం మిగిలి పోతుంది.


భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రివర్యులు పైడికొండల మాణిక్యాల రావుగారు మరణం రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి తీర్చలేనిది. 20 సంవత్సరాల పాటు ఆయనతో కలిసి పనిచేసిన సమయంలో వారికి పార్టీ పట్ల నిబద్ధత క్రమశిక్షణ à°…à°‚à°•à°¿à°¤ భావాన్ని నేను మర్చిపోలేను. వారు నేడు మామధ్య లేరనే విషయాన్ని సగటు కార్యకర్తగా జీర్ణించుకోలేకపోతున్నా. ఆయన మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతిని వారి కుటుంబ సభ్యులకు దేవుడు à°§à±ˆà°°à±à°¯à°¾à°¨à±à°¨à°¿ ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను. సందర్భంగా వారి మరణానికి చింతిస్తూ నివాళులర్పిస్తున్నాను.