మోదీ కోసం చేనేత కార్మికుడి వస్త్రం

Published: Sunday August 02, 2020

 à°…యోధ్యలో ఈనెల 5à°¨ రామాలయ నిర్మాణ భూమి పూజ కోసం వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ కోసం వారణాసిలోని à°“ నేత కార్మికుడు ప్రత్యేక వస్త్రాన్ని రూపొందించారు. 'జై శ్రీ రామ్, అయోధ్య పవిత్ర థామ్' అని à°† వస్త్రంపై ఎంబ్రాయిడరీ చేశారు. à°ˆ వస్త్రం ప్రత్యేకతను నేత కార్మికుడు బచ్చేలాల్ ఆదివారంనాడు మీడియాకు వివరించారు.

 

మెటిరీయల్, డిజైన్ à°ˆ వస్త్రం గొప్పతనమని, దీనిపై జైశ్రీమ్, అయోధ్య పవిత్ర థామ్ అని రాసి ఉంటుందని చెప్పారు. రాముడి ధనుస్సు కూడా ఇందులో డిజైన్ చేసినట్టు చెప్పారు. కాటన్, సిల్క్ దారాలతో à°ˆ క్లాత్ తయారు చేశామని, వస్త్రం తయారికీ 15 రోజులు పట్టిందని తెలిపారు. ఇందులో బంగారు, ఎరుపు రంగు వాడినట్టు చెప్పారు.  పొడవు 72 అంగుళాలు, వెడల్పు 22 అంగుళాలతో à°ˆ క్లాత్ తయారైంది. పోలీస్ కమిషనర్ ద్వారా అయోధ్యకు à°ˆ వస్త్రం పంపాలని అనుకుంటున్నట్టు ఆయన చెప్పారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతుండటం చాలా సంతోషంగా ఉందని, ఇందువల్ల పర్యాటకంతో పాటు తమ వ్యాపారం కూడా పెరుగుతుందని బచ్చే లాల్ సంతోషం వ్యక్తం చేశారు.