కరోనాతో విరివిగా అందుబాటులోకి శానిటైజర్లు

Published: Monday August 03, 2020

జిల్లాలో శానిటైజర్‌ మరణాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వారం వ్యవధిలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 20à°•à°¿ చేరింది. దీంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వీరి మరణాలకు శానిటైజరా? మరేదైనా కారణం ఉందా? అన్న సందేహాలు సర్వత్రా వస్తున్నాయి. ఒక్క కురిచేడులోనే 16 మంది మృత్యువాతపడటం రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశమైంది. à°ˆ సంఘటన ప్రభుత్వ వర్గాలను ఉలికిపాటుకు గురి చేసింది.

 

ఇటు పోలీసులు, అటు ఎస్‌ఈబీ, మరోవైపు డ్రగ్‌ కంట్రోలు అధికారులు à°ˆ వ్యవహారంపై దృష్టి సారించారు. విచారణ ప్రారంభించారు. ఇదే సమయంలో శనివారం రాత్రి ఒంగోలులోనూ à°“ యువకుడు శానిటైజర్‌ సేవించి మృతి చెందాడు. పామూరులోనూ వారం వ్యవధిలో ముగ్గురు ప్రాణాలు విడిచారు. అయితే కురిచేడులో వరుసగా ఎక్కువ సంఖ్యలో మరణాలకు శానిటైజర్లు సేవించడమే కారణమని ప్రాథమికంగా భావిస్తున్న పోలీసులు ఇతర కోణాల్లోనూ విచారిస్తున్నారు. నాటుసారా, బెల్ట్‌షాపులపై దృష్టి సారించారు. 

 

జిల్లాలో శానిటైజర్‌ మరణాల పరంపర కొనసాగుతోంది. ఒక్క కురిచేడులోనే 16 మంది మృతి చెందడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు.  కురిచేడు, పామూరుల్లో లాక్‌డౌన్‌ కారణంగా మద్యం దుకాణాలను మూసివేశారు. జిల్లాలోని పలు ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. దీంతో రోజూ మద్యం తాగే అలవాటు ఉన్న వారు, మత్తుకు బానిసలైన కొందరు పొరుగు ప్రాంతాలకు వెళ్లి మద్యం కొనుగోలు చేసి తెచ్చుకుంటుండగా, మరికొందరు శానిటైజర్లను కొనుగోలు చేసి సేవిస్తున్నారు. 

కరోనా నేపథ్యంలో శానిటైజర్ల వాడకం పెరిగింది. మెడికల్‌ షాపుల్లో వాటిని విరివిగా అందుబాటులోకి తెచ్చారు. శానిటైజర్లలో 70శాతం ఆల్కహాలు ఉండటం, మద్యంతో పోల్చుకుంటే కాస్తంత తక్కువ ధరకే లభిస్తుండటంతో పలు ప్రాంతాల్లో ముందుబాబులు దీనికి అలవాటుపడ్డారు. à°ˆ పరిస్థితుల్లో వారం వ్యవధిలో శానిటైజర్లు సేవించి 20 మంది మృత్యువాతపడటం సంచలనం కలిగించింది. 

జిల్లాలోని అనేక మంది మత్తు కోసం శానిటైజర్లను సేవిస్తున్నారు. కానీ ఒక్క కురిచేడులోనే 16 మంది చనిపోవడం అనుమానాలకు తావిస్తోంది. మద్యం ధరలు భారీగా పెరగడంతో జిల్లాలో నాటుసారా తయారీ ఊపందుకుంది. ఇతర రాష్ట్రాల మద్యం జిల్లాకు అక్రమంగా వస్తోంది. నాటుసారా కానీ, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న మద్యాన్ని కానీ శానిటైజర్లలో నింపి అమ్ముతున్నారా? లేక వినియోగం పెరిగిన నేపథ్యంలో శానిటైజర్లలోనే కల్తీ జరుగుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.