సర్కారు సహాయ నిరాకరణ

Published: Tuesday August 04, 2020

 à°°à°¾à°·à±à°Ÿà±à°° ఎన్నికల కమిషనర్‌à°—à°¾ తిరిగి బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డకు ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ కొనసాగుతూనే ఉన్నట్లు కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టు ఆదేశాలతో తిరిగి నియమించబడిన ఆయన పట్ల ప్రభుత్వ పెద్దలు గుర్రుమంటున్న విషయం తెలిసిందే. ఆయనకు సహకరించినా, సఖ్యతగా ఉన్నా... ప్రభుత్వ పెద్దల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందేమోనన్న ఆందోళన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో పనిచేసే సిబ్బందిలో కనిపించింది. హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించి రాజ్యాంగ సంస్థల విలువులు కాపాడిన అధికారిగా రాష్ట్ర, దేశవ్యాప్తంగా నిమ్మగడ్డకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కానీ సొంత కార్యాలయంలోనే ఆయనకు ఆదరణ కరువైంది. సోమవారం విజయవాడలోని కార్యాలయానికి వచ్చిన నిమ్మగడ్డ విషయంలో ప్రొటోకాల్‌ పాటించలేదు. సంబంధిత పోలీస్‌ అధికారి సెల్యూట్‌ చేసి లోపలికి తీసుకెళ్లడం వంటి గౌరవ కార్యక్రమం కూడా జరగలేదు.

 

ప్రొటోకాల్‌ ప్రకారం ముందుగానే ఏర్పాట్లు చూడాల్సిన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి వాణీమోహన్‌... ఆయన వచ్చే సమయానికి ఆఫీసుకు రాలేదు. à°† తర్వాత వచ్చి నిమ్మగడ్డను కలిసి సంజాయిషీ చెప్పుకున్నట్లు సమాచారం. తిరిగి బాధ్యతలు చేపట్టిన తర్వాత రమేశ్‌కుమార్‌ కార్యాలయానికి వస్తున్నారంటూ విలేకరులు భారీ సంఖ్యలో వచ్చినప్పటికీ కార్యాలయ సిబ్బంది మాత్రం అడ్రస్‌ లేరు. ఒకరిద్దరు సిబ్బంది మాత్రం à°’à°• పూల బొకే పట్టుకుని మొక్కుబడిగా ఆయనకు ఆహ్వానం పలికారు. పోలీసు సిబ్బంది కూడా పెద్దగా అప్రమత్తంగా కనిపించలేదు. ఆయనను కలిస్తే ప్రభుత్వ పెద్దల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందన్న ఆందోళన పలువురు ఉద్యోగుల్లో కనపడింది. పత్రికా విలేకరులు పలకరించినా కొందరు ఉద్యోగులు మొహం చాటేయడం కనిపించింది. ప్రభుత్వ అభీష్టానికి విరుద్ధంగా నియమితులైన నిమ్మగడ్డ.. ప్రభుత్వం నుంచి ఇంకెన్ని సహాయ నిరాకరణ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.