రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా

Published: Friday August 07, 2020

కరోనా కారణంగా దేశంలోని ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అయినా... ఇలాంటి పరిస్థితుల్లోనూ అన్న దాతలు పోషించిన పాత్ర చాలా గొప్పదని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు. రైతుల అంకిత భావం, చిత్తశుద్ధి కారణంగానే ఆహార భద్రతకు సమస్యల్లేవని, గతంలో కంటే ఎక్కువ ధాన్యాల ఉత్పత్తి జరిగిందని తెలిపారు.

 

స్వామి నాథన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలతో నిర్వహించిన ‘సైన్స్ ఫర్ రెజిలియంట్ ఫుడ్, న్యూట్రిషియన్ అండ్ లైవ్లీహుడ్స్’ సదస్సును ఆయన ప్రారంభించారు. à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారతీయ అన్నదాతల శక్తి సామర్థ్యాలు, à°…à°‚à°•à°¿à°¤ భావం, సంప్రదాయ వ్యవసాయ పద్థతులపై వారికున్న పరిజ్ఞానాన్ని ఆయన ప్రశంసించారు.

 

అందుకే కరోనా సమయంలో జన జీవనం స్తంభించినా... అన్నదాత అలుపెరగకుండా చేసిన కృషి కారణంగానే ఉత్పత్తి పెరిగిందని పేర్కొన్నారు. ఇందుకోసం రైతులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని, రైతు బిడ్డగా గర్విస్తున్నానని ప్రకటించారు. సంప్రదాయ వ్యవసాయానికి ఆధునిక పరిజ్ఞానం తోడైతే దేశం మరింత పురోగతి సాధిస్తుందని సూచించారు. ఆహారంలో పోషక విలువలను పొందే విధంగా ప్రాసెసింగ్ పద్ధతులపై దృష్టి పెట్టడంతో పాటు ఆహార ధాన్యాల నిల్వల సామర్థ్యాన్ని కూడా పెంచుకోవాలని తెలిపారు.

 

భూ హక్కులు, పట్టాలతో పాటు ఇతర ఆస్తులపై పురుషులతో పాటు మహిళలకు సంయుక్తంగా హక్కులుండాలన్న స్వామి నాథన్ సూచనలు ఆమోదయోగ్యమని తెలిపారు. నూతన విద్యా విధానంలో పాఠశాలల్లో చిన్నారులకు చక్కటి పోషకాహార అల్పాహారాన్ని అందించాలని నిర్ణయించడాన్ని వెంకయ్య నాయుడు ప్రశంసించారు. 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో కేంద్రం వినూత్న కార్యక్రమాలు చేపడుతోందని వెంకయ్య నాయుడు తెలిపారు.