భూ కేటాయింపుపై హైకోర్టులో విచారణ

Published: Monday August 10, 2020

రంగారెడ్డి జిల్లా మోకిల్లాలో కోట్లు విలువచేసే ఐదు ఎకరాల భూమిని à°Žà°•à°°à°‚ రూ.5 లక్షల చొప్పున సినీ దర్శకుడు ఎన్‌.శంకర్‌కు ఏ ప్రాతిపదికన కేటాయించారో చెప్పాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. à°—à°¤ ఏడాది ఆయన హైదరాబాద్‌లో సినీ స్టూడియో నిర్మాణానికి భూమి ఇప్పించవలసిందిగా కోరుతూ దరఖాస్తు చేసుకోగా, రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి à°Žà°•à°°à°‚ రూ.5 లక్షలు చొప్పున 5 ఎకరాలు కేటాయించింది. కోట్లు విలువచేసే భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.25 లక్షలకు శంకర్‌కు కట్టబెట్టడాన్ని తప్పుపడుతూ హైకోర్టులో ప్రజాహిత పిటిషన్‌ దాఖలైంది. à°ˆ కేసు విషయమై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. 

 

‘‘రూ.2.50 కోట్ల భూమిని.. ఏ ప్రాతిపదికన రూ.5లక్షలకు కేటాయించారు? కేబినెట్‌ నిర్ణయానికి కూడా à°“ ప్రాతిపదిక ఉండాలి కదా!. భూకేటాయింపులు à°“ పద్ధతిలో జరగాలని సుప్రీం పేర్కొన్నా.. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని..’’ à°¹à±ˆà°•à±‹à°°à±à°Ÿà± ప్రభుత్వాన్ని ప్రశ్నించగా.. ఏజీ క్వారంటైన్‌లో ఉన్నందున ప్రభుత్వ న్యాయవాది కోర్టును గడువు కావాలని కోరడంతో.. కోర్టు తదుపరి విచారణను à°ˆ నెల 27à°•à°¿ వాయిదా వేసింది.