ఇళ్ల పట్టాల పంపిణీ మరోసారి వాయిదా

Published: Wednesday August 12, 2020

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. ఏపీలో జూలై 8à°µ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరగాల్సి ఉంది. అయితే à°ˆ కార్యక్రమాన్ని ఆగస్ట్ 15కు వాయిదా వేస్తున్నట్టు అధికారులు గతంలో ప్రకటించారు. అయితే.. ఆగస్ట్ 15à°¨ కూడా ఇళ్ల పంపిణీ కార్యక్రమం ముందుకు వెళ్లేలా కనిపించడం లేదు. ప్రభుత్వం తాజా ప్రకటనతో à°ˆ విషయం స్పష్టమైంది.

 

ఆగస్ట్ 15న జరగాల్సిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఇళ్ల పట్టాల కేటాయింపులో వైసీపీ సర్కార్ అక్రమాలకు పాల్పడిందంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ ఇంకా పూర్తి కాలేదు. దీంతో.. కోర్టు కేసులు తేలకపోవడంతో ఇళ్ల పట్టాల పంపిణీని వైసీపీ ప్రభుత్వం మరోసారి వాయిదా వేసింది. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఎప్పుడు జరగనుందో త్వరలో ప్రకటిస్తామని ప్రభుత్వం తెలిపింది.