బెడ్ చూసి కరోనా ఆమడ దూరం

Published: Wednesday August 12, 2020

లియోనెల్‌ మెస్సీ నిద్రించే బెడ్‌ (పరుపు) చూసి కరోనా ఆమడ దూరం పోతోందట! à°† పరుపు చెంత ఉండడంతో అర్జెంటీనా సాకర్‌ స్టార్‌ కుటుంబానికి ఇప్పుడు వైరస్‌ గురించి ఎలాంటి బెంగ లేదట! అవును.. ఇది నిజమేనని స్పానిష్‌ మీడియా అంటోంది. వైరస్‌ ఆనవాళ్లు దరి చేరకుండా ఉండేలా మెస్సీ.. కరోనా వైరస్‌ నిరోధక బెడ్‌ను వాడుతున్నాడని à°† మీడియా వెల్లడించింది. టెక్‌ మూన్‌ అనే కంపెనీ  రూపొందించిన à°ˆ పరుపు ఖరీదు భారత  కరెన్సీ ప్రకారం రూ. 88వేలు. కరోనా నిరోధకంగా పనిచేసే à°ˆ బెడ్‌పై అలా వాలిపోగానే.. సదరు వ్యక్తి శరీరంలో ఉన్న వైరస్‌ కణాలన్నీ నాలుగు గంటల్లోగా చనిపోతాయట. à°ˆ పరుపు తయారీలో భాగంగా వాడిన టిష్యూ్‌సలోని నానో పార్టికల్స్‌ ఎలాంటి హానికరమైన బ్యాక్టీరియానూ దరి చేరనీయకుండా చేస్తాయట. విరివిగా మ్యాచ్‌లు ఆడే మెస్సీతో పాటు అనేకమంది ఫుట్‌బాలర్లు తరచూ కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాల్సి వస్తోంది. à°ˆ నేపథ్యంలో à°ˆ పరుపుపై నిద్రపోవడం క్రీడాకారులకు ఎంతో మేలు చేసే అంశమని సదరు కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.