వరినాట్లకు 800.. పొరుగూరులోనైతే వెయ్యి

Published: Wednesday August 12, 2020

 à°µà°¨à°ªà°°à±à°¤à°¿ మండలం మెట్‌పల్లిలో నిరుడు వరినాట్లు వేసేందుకు మహిళా కూలీలకు రూ.400 నుంచి రూ.500 దాకా చెల్లించేవారు. à°ˆ ఏడాది కూలీరేట్లు రెట్టింపయ్యాయి. రూ.800 తీసుకుంటున్నారు. అదే పొరుగూరుకు వెళ్లి నాట్లు వేయాలంటే రూ.1000 దాకా అడుగుతున్నారు. దీనికి రవాణా ఖర్చులు, మినరల్‌ వాటర్‌ ఇవ్వడం అదనం! గ్రామంలోని కొంతమంది కూలీలు à°’à°• జట్టుగా ఏర్పడి వరినాట్లు వేసేందుకు పొలాలను గుత్తకు తీసుకుంటున్నారు. మెట్‌పల్లిలోనే కాదు.. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి. కూలీల రెట్లు రెండింతలు కావడంతో రైతులు తలపట్టుకుంటున్నా తుకం (నారుమళ్లు) ముదిరిపోయి అదును దాటిపోతుండటంతో అడిగినంత చెల్లించక తప్పడం లేదు. కూలీ రేట్లు రెండింతలు కావడానికి కరోనా పరిస్థితులే కారణం. వైరస్‌ సోకుతుందనే భయంతో ఇళ్ల నుంచి కూలీలు బయటకు రావడం లేదు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి కూలీలు వచ్చే అవకాశం లేదు. దీంతో  వచ్చే à°† కొద్దిమంది కూలీ రేట్లను పెంచేశారు. విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో సాధారణం కన్నా ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగవుతున్నాయి. రాష్ట్రంలో వానాకాలం సాధారణ సాగు 1.03 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటికే 1.19 కోట్ల ఎకరాల్లో  పంటలు సాగయ్యాయి. ఇంకా పెరిగే అవకాశం ఉంది. చాలామంది రైతులు తమ పొలంలో నాట్లు వేసుకున్న తర్వాత బదులు వచ్చిన మిగతా రైతుల పొలాల్లోకి నాట్లు వేసేందుకు వెళతారు. ఇప్పుడు ఎంతయినా చెల్లించి వారి పొలంలో నాటు వేసుకుంటున్నారే తప్ప బదులు వెళ్లడం లేదు. దీంతో కూలీల అవసరం వస్తోంది.

 

 à°Žà°•à°°à°‚ విస్తీర్ణంలో నాట్లకు గతంలోనైతే 12వేల దాకా ఖర్చయ్యేది. à°ˆ ఏడాది రూ. 15 వేల నుంచి రూ. 17 వేల వరకు ఖర్చు వస్తోంది. నాగలి, గొర్రు దున్నుకానికి కలిపి రూ.5వేలు, ఒరాలు తీసి, ఒడ్లు పెట్డడానికి రూ. 1,500, ఎకరాకు 30 కేజీల తుకం లెక్కన రూ. 1,500, ఎకరాకు 7 నుంచి 8 మంది కూలీలు నాటు వేయడానికి రూ. 7,000, ఎరువులకు రూ. 2,600 మొత్తం కలిపి రూ. 17,600 వరకు పెట్టుబడి వస్తోంది. రెండుసార్లు కలుపు తీత, ఎరువులు, పురుగు మందులు పిచికారి, వరికోత ఖర్చు ఇలా చాలానే ఉంటాయని రైతులు చెబుతున్నారు. పంట చేతికొచ్చినా ఇక మిగిలేది ఏం ఉంటుందని వాపోతున్నారు. కూలీలు మాత్రం నాట్ల సీజన్‌లోనే రూ.24 వేల నుంచి రూ.30 వేల దాకా సంపాదిస్తున్నారు. ఒరాలు తీసి.. ఒడ్లు పెట్టడానికి మగవారే అవసరం! వారేమో రూ.1000  నుంచి రూ.1200 దాకా అడుగుతున్నారు.