ట్యాపింగ్‌ నిజమైతే సర్కార్‌ బర్తరఫే

Published: Sunday August 16, 2020

ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాపింగ్‌ చేయడం దారుణమని, దీనిపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తానని విజయవాడకు చెందిన మాజీ న్యాయమూర్తి, హైకోర్టు సీనియర్‌ న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్‌ వెల్లడించారు.  

 à°¹à±ˆà°•à±‹à°°à±à°Ÿà±à°²à±‹ సోమవారం పిల్‌ దాఖలు చేస్తాను. న్యాయస్థానాలపై నిఘా నిజమైతే ఆర్టికల్‌ 356 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణమే బర్తరఫ్‌ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన న్యాయవ్యవస్థపై ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వమే దేశంలో ఎక్కడా లేని విధంగా దాడి చేయడం దారుణం.  ప్రజాస్వామ్య చరిత్రలో ఇది à°“ చీకటి అధ్యాయం.

 

అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగంలో న్యాయవ్యవస్థ అత్యంత ఉన్నతమైనది. అలాంటి వ్యవస్థపై ప్రభుత్వమే దాడి చేయడం చరిత్రలో ఎన్నడూ చూడలేదు. న్యాయవ్యవస్థల స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ ఏపీలో న్యాయవ్యవస్థపైన.. న్యాయమూర్తులపైన అధికార పార్టీ నాయకులే మాటల దాడి చేస్తున్నారు. అధికార పార్టీలో కీలక స్థానాల్లో ఉన్నవారే న్యాయమూర్తులను అవమానపరిచేలా, న్యాయవ్యవస్థను కించపరిచేలా మాట్లాడటం సరైనది కాదు’’ అని పేర్కొన్నారు. న్యాయమూర్తుల ఫోన్‌ ట్యాపింగ్‌పై స్వతంత్ర సంస్థతో కానీ సిట్టింగ్‌ జడ్జితో కానీ పూర్తిస్థాయి విచారణ చేయించాలని తన పిటిషన్‌లో హైకోర్టును కోరనున్నట్లు శ్రవణ్‌కుమార్‌ తెలిపారు. ‘‘పౌరుల వ్యక్తిగత సమాచార భద్రత విషయంలో సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం ఇటీవల అద్భుతమైన తీర్పు ఇచ్చింది. పౌరుల వ్యక్తిగత సమాచారం ఆర్టికల్‌ 21 కిందకు వస్తుందని à°† తీర్పులో పేర్కొన్నారు. à°’à°•à°°à°¿ ఫోన్‌ ట్యాప్‌ చేయడం అంటే అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది.

 

అయితే టెలిగ్రాఫ్‌ యాక్ట్‌ à°•à°¿à°‚à°¦ కొన్ని మినహాయింపులు ఉన్నాయి. తీవ్రవాదులు, దేశభద్రతకు à°­à°‚à°—à°‚ కలిగించే వ్యక్తుల ఫోన్లను ముందస్తు సమాచారం లేకుండానే ట్యాప్‌ చేయవచ్చు. సాధారణంగా ఎవరి ఫోన్లు ట్యాప్‌ చేయాలనే దానిపై హోమ్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ à°“ నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఏపీలో à°“ కానిస్టేబుల్‌ లెటర్‌ ఇస్తే ఫోన్లు ట్యాప్‌ చేసే పరిస్థితి ఉంది. న్యాయమూర్తుల ఫోన్‌ ట్యాప్‌ చేయడమే నిజమైతే, à°ˆ ప్రభుత్వానికి ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగే అర్హత లేదని శ్రవణ్‌కుమార్‌ అన్నారు.