కరోనా కన్నా భయంతో పోతున్న ప్రాణాలు

Published: Monday August 17, 2020

‘‘దెయ్యం కంటే భయం మా చెడ్డదండీ’’.. à°“ తెలుగు సినిమాలో డైలాగ్‌ ఇది. ప్రపంచ వ్యాప్తంగా కోరలు చాచి విజృంభిస్తున్న కరోనా అనే దెయ్యం విషయంలోనూ ఇది నూటికి నూరుపాళ్లు వర్తిస్తుంది. కొవిడ్‌ బాధితుల్ని పక్కనపెడితే.. పక్కింట్లో ఎవరికైనా కరోనా వచ్చిందని తెలిస్తే చాలు, ఇటువైపు ఉండేవారు గడగడలాడుతున్నారు. లేని ఆదుర్దాను తెచ్చుకుని వెంటనే నిర్ధారణ పరీక్షలకు పరిగెత్తేవారికి కొదవే లేదు. ఇటీవల చిత్తూరు జిల్లాలో కరోనా బారిన పడిన à°“ టీవీ జర్నలిస్టు, వైరస్‌ తీవ్రత మరీ ఎక్కువగా లేకపోయినా విపరీతమైన ఆందోళనతో కన్నుమూశారు. సరిగ్గా పది రోజులు చికిత్స తీసుకుంటే కరోనాను జయించి, మళ్లీ మనుపటి మనిషిలా చురుగ్గా మారే అవకాశం ఉంది. అయితే కావాల్సిందల్లా మనోనిబ్బరం, ఓపిక, ధైర్యం.

 

కరోనా వస్తే ప్రాణాలు పోతాయని, చికిత్స కోసం ఆస్పత్రులకు వెళ్తే వైద్యులు పట్టించుకోరని, కుటుంబీకులు కూడా దగ్గరకు రారని, à°’à°‚à°Ÿà°°à°¿ అయిపోతామన్న ఆందోళన, బెంగ పెట్టుకునేవారే ఎక్కువగా ఉంటున్నారు. à°ˆ భయమే మనిషిని మింగేస్తోంది. లక్షణాలుండి రోగ నిర్ధారణ కాకున్నా, చికిత్సతో మరి కొద్దిరోజుల్లో కోలుకునే అవకాశం ఉన్నవారు సైతం భయాందోళనతో ఉసురు తీసుకుంటున్నారు. మరికొందరు ఆస్పత్రికి వెళ్లేలోపే బలవన్మరణానికి పాల్పడుతున్నారు. అసలు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోక ముందే భయంతో ఊపిరి వదిలేస్తున్న ఘటనలూ వెలుగు చూస్తున్నాయి. అయితే కరోనా వస్తే ప్రాణాలు పోవని, మందులతో పాటు ధైర్యమే సగం బలమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అపోహలకు గురయి మనోధైర్యాన్ని కోల్పోవద్దని సూచిస్తున్నారు. సకాలంలో వైద్యం తీసుకుంటే కరోనాతో ప్రా ణాలకు ఎలాంటి ముప్పులేదని స్పష్టం చేస్తున్నారు. శ్వాసకోశ సమస్యలు, గుండెజబ్బులు, బీపీ, షుగర్‌, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు సైతం చికిత్స అనంతరం క్షేమంగా బయట పడ్డారని ఇటీవల 105ఏళ్ల వృద్ధురాలు హోం ఐసొలేషన్‌లోనే ఉండి కరోనాను జయించి రికార్డు సృష్టించారని గుర్తు చేస్తున్నారు.