డ్రీమ్11పై అప్పుడే వివాదం.

Published: Tuesday August 18, 2020

ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను సొంతం చేసుకున్న దేశీయ ఫ్యాంటసీ స్పోర్ట్స్ ఫ్లాట్‌ఫామ్ డ్రీమ్11 సంస్థపై అప్పుడే వివాదం రేగింది. రూ.222 కోట్లతో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను సొంతం చేసుకున్న డ్రీమ్11కు, చైనాకు చెందిన ఇంటర్‌నెట్ సెర్చ్ ఇంజిన్ సంస్థ టెన్సెంట్‌ హోల్డింగ్స్‌కు ఆర్థిక సంబంధాలున్నట్లు తెలిసింది. డ్రీమ్11కు ఆర్థిక వనరులను సమకూర్చిన సంస్థల్లో టెన్సెంట్ హోల్డింగ్స్ సంస్థ à°’à°•à°Ÿà°¿ కావడం గమనార్హం.

 

భారత్, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని పెద్ద ఎత్తున నిరసనలు రేగిన క్రమంలో చైనా మొబైల్ కంపెనీ వివో ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ నుంచి à°ˆ సీజన్ వరకూ తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో.. డ్రీమ్‌ లెవెన్‌, టాటా సన్స్‌, బైజూస్‌, రిలయన్స్‌ జియో, పతంజలి, అన్‌అకాడమీ సంస్థలు స్పాన్సర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. వీటిలో.. డ్రీమ్ లెవెన్ ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ హక్కులను దక్కించుకుంది. అయితే.. à°ˆ సంస్థకూ చైనాకు సంబంధించిన సంస్థతో ఆర్థిక సంబంధాలుండటంతో బీసీసీఐపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.