ఎవరెంత లాగినా ఇందులో పడవద్దు

Published: Tuesday August 18, 2020

బెజవాడ స్వర్ణ ప్యాలెస్‌ అగ్నిప్రమాదంపై వరుసగా పోస్టులు పెడుతున్న సినీ హీరో రామ్‌ సోమవారం మరోసారి ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘‘ప్రియమైన సోదర సోదరీమణులకు! కులం అనే వ్యాధి కరోనా కన్నా వేగంగా వ్యాపిస్తుంది. ఇది మరింత ప్రమాదకరమైన అంటువ్యాధి. à°ˆ సైలెంట్‌ స్ర్పెడర్స్‌ మిమ్మల్ని ఇందులోకి లాగడానికి లేదా నెట్టడానికి à°Žà°‚à°¤ ప్రయత్నించినా దూరంగా ఉండండి. లోక కల్యాణం కోసం అందరూ కలిసి ఉండండి’’ అంటూ పిలుపునిచ్చారు. స్వర్ణ ప్యాలె్‌సలో ప్రమాదంపై à°—à°¤ శనివారం రామ్‌ తన ట్వీట్ల పరంపరను ప్రారంభించారు. ‘రమేశ్‌ హాస్పిటల్స్‌కు ఇవ్వడానికి ముందు à°ˆ ప్యాలె్‌సలో రాష్ట్ర ప్రభుత్వం క్వారంటైన్‌ సెంటర్‌ నడిపింది. అప్పుడీ అగ్నిప్రమాదం జరిగి ఉంటే ఎవరిని నిందించేవారు?’’ అని à°† ట్వీట్‌లో ప్రశ్నించారు.

 

అలాగే.. ‘అందరినీ ఫూల్స్‌ని చేయడానికే విషయాన్ని ఫైర్‌ నుంచి ఫీజువైపు మళ్లిస్తున్నారా?’ అని ఒకసారి, ‘సీఎంను తప్పుగా చూపించడానికి పెద్ద కుట్ర జరుగుతున్నట్టుంది’ అని మరోసారి...‘వైఎస్‌జగన్‌ గారూ..మీ à°•à°¿à°‚à°¦ పనిచేసే కొంతమంది మీకు తెలియకుండా చేసే కొన్నిపనుల వల్ల మీ రెప్యుటేషన్‌à°•à±€, మీమీద మేంపెట్టుకొన్న నమ్మకానికీ డ్యామేజీ కలుగుతోంది. వాళ్లమీద à°“ లుక్కేస్తారని ఆశిస్తున్నాం’ అని ఇంకొకసారి పోస్టు చేశారు. ఇందుకుగాను రామ్‌కు నోటీసులు ఇస్తామని బెజవాడ పోలీసులు చెప్పడం రాజకీయ, వైద్యవర్గాల్లో విస్మయం కలిగిస్తోంది.