మన ఆలోచనలు టెక్నాలజీ చేతిలోకి వెళ్లిపోతున్న ప్రమాదకర పరిణామం

Published: Saturday August 22, 2020

అల్గారిథమ్స్‌... ఇది సాంకేతిక పదం కాదు.. ఇప్పుడు మన జీవితాలను మనవి కాకుండా చేస్తున్న సాంకేతికత! మన జీవితం, మన ఆలోచనలు మన చేతిలో నుంచి టెక్నాలజీ చేతిలోకి వెళ్లిపోతున్న ప్రమాదకర పరిణామం. నచ్చిన కంటెంట్‌ ఇది భలే చూపిస్తోందే అని చాలామంది సంబరపడిపోతూ ఉంటారు. టెక్నాలజీని తెగ మెచ్చేసుకుంటారు. కానీ తమ ఆలోచనలు, వ్యక్తిత్వం మొత్తాన్ని మెషిన్‌ లెర్నింగ్‌ ఆల్గారిథమ్స్‌ సమూలంగా మార్చేస్తున్నాయని గ్రహించలేకపోతారు.

 

యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ లాంటి దాదాపు అన్ని టెక్నాలజీ కంపెనీలు చాలా కాలంగా మెషిన్‌ లెర్నింగ్‌ పద్ధతులు అనుసరిస్తున్నాయి. సంబంధిత సర్వీసుల్లో మీరు అకౌంట్‌ క్రియేట్‌ చేసుకోవడం ఆలస్యం.. అవి ఎప్పటికప్పుడు నిశితంగా మీరు ఎలాంటి వీడియోలు à°Žà°‚à°¤ సమయం చూస్తున్నారు? ఏ వీడియోలు, పోస్టుల దగ్గర ఆగకుండా ముందుకు కదులుతున్నారు? అనే సమాచారం మొత్తాన్ని ‘హీట్‌ మ్యాప్స్‌’ అనే ఏర్పాటు ద్వారా మీకు తెలియకుండానే విశ్లేషిస్తూ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మెషిన్‌ లెర్నింగ్‌ నిరంతరం మీ ఇష్టాయిష్టాలను గమనిస్తూ మీ గురించి నేర్చుకుంటూ ఉంటుంది. ఇకమీదట సరిగ్గా మీకు నచ్చే కంటెంట్‌ యూట్యూబ్‌ రికమండేషన్స్‌ రూపంలో, ఫేస్‌బుక్‌ న్యూస్‌ఫీడ్‌లో చూపిస్తుంది.

 

కేవలం à°’à°• వ్యక్తి ఇష్టాయిష్టాలు మాత్రమే కాదు.. సామూహికంగా à°’à°• నగరంలో, à°’à°• రాష్ట్రంలో, à°’à°• దేశంలో అధిక శాతం మంది ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌ వినియోగదారులు ఎలాంటి కంటెంట్‌ చూస్తున్నారు అన్నది కూడా ‘ట్రెండింగ్‌’ రూపంలో మన ముందుకు తీసుకురాబడుతుంది. అంటే సమాజం మొత్తం మంచి విషయాలు పక్కన పెట్టి సంచలనాత్మక విషయాలు చూస్తూ కూర్చున్నారు అనుకుందాం. మీకు అలాంటి కంటెంట్‌ వద్దు అనుకున్నా తప్పించుకోటానికి లేకుండా అది ‘ట్రెండింగ్‌’ అనే విభాగంలో మీ దృష్టికి బలవంతంగా తీసుకురాబడుతుంది. అంటే మీ వ్యక్తిగత ఇష్టాయిష్టాలు కావచ్చు, సమాజం మొత్తం చేసే బలహీన ఆలోచనలు కావచ్చు.. అవి మీరు తెల్లారి లేచింది మొదలు కొన్ని వందల సార్లు ఓపెన్‌ చేసే ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ వంటి యాప్స్‌లో ప్రతిఫలిస్తుంటాయి. దాంతో వ్యక్తులు తమ ప్రాధాన్యతలు మర్చిపోయి ఇలాంటి మాయలో పూర్తిగా మునిగిపోతారు.