ఈ ఏడాది చివరికి కోవిడ్ వ్యాక్సిన్

Published: Sunday August 23, 2020

అంతా అనుకున్నట్లే జరిగితే à°ˆ ఏడాది చివరినాటికి నోవల్ కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చునని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్థన్ చెప్పారు. 3 కోవిడ్-19 వ్యాక్సిన్ క్యాండిడేట్స్ మన దేశంలో వివిధ దశల్లో ఉన్నాయని, వీటిలో రెండిటిని దేశీయంగా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. 

 

భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ ఇటీవల మాట్లాడుతూ, జైడీస్ క్యాడిలా లిమిటెడ్, ఐసీఎంఆర్ సహకారంతో భారత్ బయోటెక్ తయారు చేసిన వ్యాక్సిన్ క్యాండిడేట్ల హ్యూమన్ క్లినికల్ ట్రయల్ మొదటి దశ పూర్తయిందన్నారు. à°ˆ పరీక్షలు రెండో దశకు చేరాయన్నారు. 

 

ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధిపరచిన కోవిడ్-19 వ్యాక్సిన్ క్యాండిడేట్‌ను తయారు చేసేందుకు సెరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఆస్ట్రాజెనెకా జతకట్టాయి. à°ˆ వ్యాక్సిన్ క్యాండిడేట్‌ రెండో దశ, మూడో దశ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ భారత దేశంలో నిర్వహించేందుకు అనుమతి మంజూరైంది. వచ్చే వారం నుంచి ట్రయల్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.