అంధకారంలోనే ఏజెన్సీ, లంక గ్రామాలు

Published: Tuesday August 25, 2020

గోదావరి శాంతించింది. అయినా ఉభయ గోదావరి జిల్లాలను వరద వీడలేదు. దేవీపట్నం, à°šà°¿à°‚ తూరు, కూనవరం, వీఆర్‌ పురం, ఎటపాక మండలాల్లోని గ్రామాలతోపాటు రాజమహేంద్రవరం à°…à°–à°‚à°¡ గోదావరిలోని లంకలు, కోనసీమ లంకలు, ఏటిగట్టు లో పల పలు గ్రామాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. ఇళ్లలోను, రోడ్లపైనా నీరుంది. భద్రాచలం వద్ద నీటిమట్టం తగ్గినప్పటికీ, ఇంకా అక్కడి నుంచి 6,09,689 క్యూసెక్కుల ప్రవాహం పాపికొండలు మీదుగా వస్తోం ది. భద్రాచలం వద్ద నీటిమట్టం 38.40 అడుగులుంది. కూనవరం వద్ద 17.76 మీటర్లు ఉంది. కానీ, వరద à°…à°‚ తా పోలవరం కాఫర్‌డ్యామ్‌ మీదుగా రాజమహేంద్రవరం à°…à°–à°‚à°¡ గోదావరిలోకి చేరుతుండడంతో ఇంకా సముద్రంలానే ఉంది.

 

సోమవారం రాత్రి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 13.70 అడుగులు ఉంది. బ్యారేజీ నుంచి సముద్రంలోకి 12,74,020 క్యూ సెక్కుల ప్రవాహం పోతోంది. పాండ్‌ లెవెల్‌ 14.85 మీ టర్లుగా ఉంది. కాలువలకు 10,300 క్యూసెక్కులు వదిలేస్తున్నారు. లంకలు, ఏజెన్సీ గ్రామాలన్నీ ఇంకా అంధకారంలోనే ఉన్నాయి. కోనసీమలోని లంకలింకా వరదలోనే ఉన్నాయి. అప్పనపల్లి వేంకటేశ్వరస్వామి ఆల యం వరదలోనే ఉంది. కాగా, వరద ప్రభావంతో లంకల్లోని పంటలన్నీ దెబ్బతిన్నాయి. కూరగాయలు, à°…à°°à°Ÿà°¿, బొప్పా యి తదితర పంటలూ నష్టపోయాయి. వేమగిరిలంక, కడియపులంక, బుర్రిలంక, బడుగువానిలంకలతోపాటు ఏటిగట్టు సమీపంలోని నర్సరీలు పూర్తి à°—à°¾ మునిపోయాయి. దీంతో కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయా యి.  పోలవరం ప్రాజెక్టు ఎగువనున్న గిరిజన గ్రామాలన్నీ నీటమునిగాయి. దీంతో వందలాది గిరిజన కుటుంబాలు కొండలు, కోనల్లోకి వెళ్లి టెంట్లు వేసుకొని జీవనం సాగిస్తున్నాయి.