స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయ(లే)ని అధికారులు

Published: Thursday September 03, 2020

కరోనా ప్రభావం జిల్లాలో అన్ని రంగాలపైన పడింది. అనేక వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఎందరికో ఉపాధి పోయింది. కానీ, ఎర్రచందనం అక్రమ రవాణా మాత్రం యథేచ్ఛగా సాగిపోతోంది. మునుపటి కంటే మరింత ఎక్కువగా అటవీ సంపద తరలిపోతోంది. స్మగ్లింగ్‌లో భాగస్వాములైన వారి జేబులు నింపుతోంది. 

 

ఒకనాటి స్మగ్లర్లు నేతలు, ప్రజాప్రతినిధులుగా మారడం.. కట్టడి చేయాల్సిన శాఖ చేష్టలుడిగిపోవడం.. ఇన్‌ఫార్మర్ల వ్యవస్థ నిర్వీర్యం కావడంతో కరోనా సమయంలోనూ ఎర్ర స్మగ్లర్లు సాఫీగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఎర్రావారిపాలెం, చిన్నగొట్టిగల్లు, చంద్రగిరి, తిరుపతి రూరల్‌ మండలాల్లో ఇదివరకు స్మగ్లర్లుగా ఉన్నవారు.. కేసుల్లో చిక్కుకుని జైలుకు వెళ్లొచ్చిన వారు చాలామంది ఇప్పుడు అధికార పార్టీలో స్థానిక నాయకులుగా ఎదిగారు. కొందరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా కూడా హోదాను సంతరించుకుంటున్నారు. ఉదాహరణకు ఎర్రావారిపాలెం మండలంలో మాజీ సర్పంచ్‌à°—à°¾ వున్న à°“ స్మగ్లర్‌ ఇటీవల ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంపీపీ పదవినీ ఆయనకే రిజర్వు చేసిపెట్టినట్టు సమాచారం. స్మగ్లింగ్‌లో ఇలాంటివారి ప్రమేయం ఉండటంతో పోలీసు, అటవీ శాఖలు నిఘా, నిరోధక చర్యలు తగ్గించేశాయన్న ఆరోపణలున్నాయి. వీరు వాహనాలను ఆపి తనిఖీ చేసినా అధికార పార్టీ వారివైతే వదిలిపెట్టేస్తున్నారని విమర్శలున్నాయి. ఇతరులవైతే మాత్రం సీజ్‌ చేసి కేసులు పెడుతున్నారనే ఆరోపణలున్నాయి.