ఏపీలో తగ్గిన మద్యం ధరలు

Published: Thursday September 03, 2020

మద్యం ధరలను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశీయంగా తయారైన విదేశీ మద్యం ధరలు ప్రభుత్వం సవరించింది. 180 ఎంఎల్‌ బాటిల్ ధర రూ.120à°•à°¿ మించని బ్రాండ్లకు.. రూ.30 నుంచి రూ.120 వరకు ప్రభుత్వం తగ్గించింది. క్వార్టర్‌ ధర రూ.120 నుంచి రూ.150 వరకూ ఉన్న బ్రాండ్లకు.. రూ.30 నుంచి 280 వరకు తగ్గించారు. క్వార్టర్ రూ.150 నుంచి 190 మధ్య ఉన్న బ్రాండ్ల ధరలు యధాతథం చేశారు. క్వార్టర్ రూ.190 నుంచి రూ.210 కంటే ఎక్కువ ఉన్న బ్రాండ్లకు.. రూ.40 నుంచి రూ.300 వరకు పెంచుతున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.బీర్లు, రెడీ టు డ్రింక్‌పై రూ.30 తగ్గించారు. ఇవాళ్టి నుంచి సవరించిన ధరలు వర్తిస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ధరలు సవరించాలని ప్రభుత్వానికి ఎస్ఈబీ సిఫార్సు చేసింది. శానిటైజర్లు, మిథైల్ ఆల్కహాల్ తాగి ప్రాణాలు కోల్పోతున్నారని, ధరలు సవరించాల్సిందిగా ప్రభుత్వానికి ఎస్ఈబీ విజ్ఞప్తి చేసింది.

 

 

మరోవైపు ఇతర రాష్ట్రాల నుండి మద్యాన్ని తీసుకు వచ్చే వ్యక్తులకు వెసులుబాటు కల్పిస్తూ ఏపీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. జీవో నెంబర్ 411 ప్రకారం మద్యాన్ని తీసుకుని వచ్చే వెసులుబాటు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై ఉన్నతన్యాయస్థానం à°ˆ మేరకు తీర్పును వెలువరించింది. à°ˆ తీర్పు ప్రకారం ఎవరైనా ఇతర రాష్ట్రాల నుంచి మూడు మద్యం బాటిళ్లు తెచ్చుకునే అవకాశాన్ని హైకోర్టు కలిగించింది.