విద్యుత్‌ పంపిణీ ప్రైవేటుపరం

Published: Friday September 04, 2020

ప్రస్తుత విద్యుత్‌ పంపిణీ పూర్తిగా రాష్ట్రప్రభుత్వ అధీనంలోనే ఉంది. విద్యుత్‌ రంగంలో కొన్ని కొత్త సంస్థల ఏర్పాటు జరిగినా అవన్నీ పూర్తిగా సర్కారు ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నాయి. అయితే à°ˆ పరిస్థితిని మార్చాలని త్వరలో కేంద్రం తీసుకురానున్న కొత్త విద్యుత్‌ బిల్లు ప్రతిపాదిస్తోంది. దాని ప్రకారం.. కింది స్ధాయిలో విద్యుత్‌ పంపిణీని ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తారు. విద్యుత్‌ డివిజన్‌ను  యూనిట్‌à°—à°¾ తీసుకుని.. ఒక్కో డివిజన్‌ను ఒక్కో సంస్ధకు కేటాయిస్తారు.

 

విద్యుత్‌ను వినియోగదారుడికి సవ్యంగా పంపిణీ చేయడం.. బిల్లులు వసూలు చేయడం వాటిదే బాధ్యత. సరఫరా చేస్తున్న విద్యుత్‌ ఎవరికి à°Žà°‚à°¤ వెళ్తున్నదీ తెలియాలంటే ప్రతి కనెక్షన్‌కూ మీటర్‌ ఉండి తీరాలి. ఇప్పుడు వ్యవసాయ రంగంలోని పంపుసెట్లకు మాత్రమే మీటర్లు లేవు. అవి à°Žà°‚à°¤ కరెంటు వాడుతున్నాయో ఇప్పటిదాకా ఉజ్జాయింపు లెక్కలే తప్ప వాస్తవ పరిస్థితి ఎవరికీ తెలియదు.

 

పంపిణీని ప్రైవేటుపరం చేయాలంటే à°† రంగంలోకి వచ్చే సంస్థలు కచ్చితంగా ప్రతి కనెక్షన్‌కూ మీటర్‌ ఉండాలని డిమాండ్‌ చేస్తాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే కేంద్రం నగదు బదిలీ పేరుతో పంపుసెట్లకు  మీటర్ల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. వీటన్నిటినీ కొత్త బిల్లులో చేర్చారు. బిల్లు ముసాయిదా ప్రతిని అన్ని రాష్ట్రాలకు పంపి వాటి అభిప్రాయాలూ తీసుకున్నారు. అన్నీ అనుకూలిస్తే à°ˆ నెలలో జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో దీనిని ఆమోదింపజేసుకోలని కేంద్రం యోచిస్తోంది.

విద్యుత్‌ బిల్లులోని కొన్ని అంశాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తన అభ్యంతరాలను లిఖితపూర్వకంగా తెలియజేసింది. అంతేతప్ప మొత్తంగా బిల్లును వ్యతిరేకించలేదు. ఏ వర్గాలకు సబ్సిడీ ఇవ్వాలనేది రాష్ట్రం పరిధిలో ఉండాలని.. రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి పాత్రను పరిమితం చేసి కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలికి ఎక్కువ అధికారాలు కట్టబెట్టడం సమంజసం కాదని తన అభ్యంతరాల్లో ప్రభుత్వం పేర్కొన్నట్లు సమాచారం. విద్యుత్‌ పంపిణీని ప్రైవేటుపరం చేసే ప్రతిపాదనను మాత్రం వ్యతిరేకించలేదు.

 

తాము ప్రస్తావించిన అభ్యంతరాలపై కేంద్రం స్పష్టత ఇస్తే à°ˆ బిల్లుకు పార్లమెంటులో మద్దతిచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం సుముఖంగానే ఉందని విద్యుత్‌ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

కానీ పొరుగు రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం పూర్తి భిన్నమైన వైఖరిని తీసుకుంది. à°ˆ బిల్లు రాష్ట్రాల అధికారాలను హరించడమేనని, దానిని పార్లమెంటులో వ్యతిరేకించి తీరతామని à°† రాష్ట్ర సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.