అందరికీ ప్రకృతి వ్యవసాయం!

Published: Tuesday September 08, 2020

‘ప్రకృతి వ్యవసాయం గురించి అందరికీ తెలియాలి. à°ˆ తరహా సాగు విధానంతో.. చిన్నపాటి భూమిలో à°’à°• కుటుంబంలోని నలుగురు కలిసి పని చేసుకుంటే à°Žà°‚à°¤ ఆదాయం వస్తుంద’నే ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

 

‘చారెడు నేల.. బతుకు బాట’ పేరిట.. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే కార్యక్రమానికి పవన్‌ ఇటీవల శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం హైదరాబాద్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో.. ప్రకృతి రైతు విజయరామ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. à°ˆ తరహా వ్యవసాయ విధానం గురించి, దాని అవసరం, విశిష్టత గురించి ప్రకృతి రైతు విజయరామ్‌కు విశేష అనుభవం ఉందని, ఆయనపై నమ్మకంతోనే ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని భుజాన వేసుకున్నానని పవన్‌ చెప్పారు.

 

విజయరామ్‌ మాట్లాడుతూ.. ‘ప్రకృతి వ్యవసాయ పితామహుడు పాలేకర్‌ చెప్పినట్లు.. గ్రామాల డబ్బు గ్రామాల్లోనే ఉండాలి.. నగరాల డబ్బు గ్రామాలకు రావాలి, అదే ప్రకృతి వ్యవసాయ ఫలితం. పాలేకర్‌ తెలుగు రాష్ట్రాలకు చాలా ఎక్కువ సమయం ఇచ్చారు.. కానీ ప్రకృతి వ్యవసాయంలో కర్ణాటక మొదటిస్థానంలో ఉంది. గోవును పూజించే స్వాములు, పీఠాధిపతులు తమ భక్తులకు ప్రకృతి సాగు గురించి వివరించడంతో మంచి ఫలితాలొచ్చాయి. అలాంటి బాధ్యత ఇక్కడి స్వాములూ తీసుకోవాలి’ అని సూచించారు.