మనో వికాస కేంద్రాలుగా అంగన్‌వాడీలు

Published: Tuesday September 08, 2020

‘‘శారీరక ఆరోగ్యంతోనే మానసిక ఆరోగ్యం సాధ్యమవుతుంది(హెల్త్‌ బాడీ ఉంటేనే హెల్త్‌ మైండ్‌). అప్పుడే బాలల్లో వికాసం కనిపిస్తుంది. అందుకే వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్‌ పథకాలు అమలు చేస్తున్నాం’’ అని సీఎం జగన్‌ అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, వైఎస్సార్‌ సంపూర్ణ  పోషణ ప్లస్‌ పథకాలను సీఎం ప్రారంభించారు.

తల్లులకు పోషణ, పిల్లలకు సంరక్షణ, చదువుల్లో à°’à°• విప్లవం, à°† లక్ష్యాలతోనే à°ˆ కార్యక్రమాలు 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లోని దాదాపు 30.16 లక్షల అక్కచెల్లెమ్మలు, చిన్నపిల్లలకు లబ్ధి చేకూర్చుతాయని సీఎం వివరించారు.

‘అంగన్‌వాడీ కేంద్రాలకు ఏటా రూ.500 కోట్లు ఇస్తే ఎక్కువ అన్నట్లుగా గతంలో వ్యవహరించారు. అంగన్‌వాడీ కేంద్రాలంటే ఏదో ఆహారం ఇవ్వడమే కాదు, వాటిని మనో వికాస కేంద్రాలుగా మార్చాలన్న గట్టి తపనతో ఈకార్యక్రమాలు అమలు చేస్తున్నా’’మన్నారు. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ యాప్‌, ప్యాకెట్‌ బుక్‌తో పాటు ఎస్‌వోపీ బుక్‌లెట్‌ను కూడా ఆయన ఆవిష్కరించారు.