దళితులకు రక్షణ కరువైంది.

Published: Tuesday September 08, 2020

రాష్ట్రంలో దళితులకు రక్షణ కరువైంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులే లక్ష్యంగా హింసకు పాల్పడుతున్నారు. దళిత ఉద్యోగులు, అధికారులు, అడ్వొకేట్లు, నేతలపై అధికార పార్టీ శ్రేణుల దాడులు పెరిగిపోయాయి. ‘‘మేం అధికారంలో ఉన్నాం... కుక్కిన పేనుల్లా పడుండండి’’ అంటూ వైసీపీ నేతలు వారిపై హూంకరిస్తున్నారు. దీనికితోడు పోలీసుల వేధింపులు కూడా ఎక్కువయ్యాయి. జిల్లాల్లో దళితులపై జరిగిన దాడులకు సంబంధించి అట్రాసిటీకి బదులుగా మామూలు కేసులు నమోదు చేస్తున్నారు. కొన్నిచోట్ల దళితులపైనే అక్రమంగా కేసులు బనాయించి పోలీసుస్టేషన్లకు పిలిపించి బెదిరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దళితులపై దాడులకు సంబంధించి 150à°•à°¿ పైగా కేసులు నమోదైనా ప్రభుత్వం, పోలీసులు కంటితుడుపు చర్యలకే పరిమితమయ్యారన్న విమర్శలు వస్తున్నాయి. ఇతర పార్టీల దళిత నాయకులెవరూ బహిరంగంగా పత్రికా ప్రకటనలైనా ఇచ్చే పరిస్థితి లేదు.

 

గ్రామాల్లో దళితుల అసైన్డ్‌ భూములను పేదల ఇళ్ల స్థలాలకు ఇచ్చేందుకు పలు గ్రామాల్లో à°°à°‚à°—à°‚ సిద్ధం చేశారు. అదేమని ప్రశ్నించి వారిపై కేసులు పెడుతున్నారు. వైసీపీకి ఓట్లు వేయలేదని గ్రామాల్లో పెన్షన్లు నిలిపేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఫీల్డ్‌ అసిస్టెంట్లను ఉన్నఫళంగా తొలగించారు. ఇదే పథకంలో అటెండర్‌à°—à°¾, డ్వాక్రా గ్రూపులకు సంబంధించి యానిమేటర్లుగా పనిచేస్తున్న వారికి, మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు, అంగన్‌వాడీ ఆయాలు నిత్యం వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో ప్రత్యర్థి పార్టీల తరఫున బరిలో నిలిచిన దళితులకు గ్రామాల్లో సహాయ నిరాకరణ చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో తాగునీటిని వాడుకోనీయడం లేదు. మరికొన్ని గ్రామాల్లో పోటీ చేసినవారిపై బెదిరింపులు కొనసాగుతున్నాయి. చివరకు ఉపాధి హామీ పథకంలో కూలీలుగా కూడా ప్రత్యర్థి పార్టీలకు చెందినవారంటూ వివక్ష చూపించడం సర్వసాధారణమైంది.