గాంధీ జయంతినాడు గిరిజనులకు పట్టాలు

Published: Wednesday September 09, 2020

వచ్చే నెల 2à°¨ గాంధీ జయంతినాడు రాష్ట్రంలోని 35 షెడ్యూల్డు మండలాల్లో గిరిజనులకు ఆర్‌వోఎ్‌ఫఆర్‌ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్టు సీఎం జగన్‌ ప్రకటించారు. మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమంలో భాగంగా సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇంటి స్థలాల సరిహద్దులను గుర్తించి రాళ్లను పాతి లబ్ధిదారులను వారికి కేటాయించిన స్థలాల వద్ద నిలబెట్టి ఫొటోలు తీయాలని కలెక్టర్లను ఆదేశించారు. అదేవిధంగా పట్టణ ఆరోగ్య కేంద్రాలకు స్థలాలను గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించారు. కొత్తగా 16 బోధనాసుపత్రలను నిర్మించబోతున్నామని, వచ్చే నెల నాటికి వీటికి టెండర్లు ఖరారవుతాయని తెలిపారు. ‘నాడు-నేడు’ స్కూల్స్‌కు సంబంధించి తొమ్మిది అంశాలతో పాటు పదో అంశంగా వంటగదినీ చేర్చినట్టు సీఎం జగన్‌ తెలిపారు. అక్టోబరు 10à°¨ పాఠశాలలు తెరిచే వీలుందని, à°ˆ నేపథ్యంలో ఆయా పనులను à°ˆ నెల 30లోగా పూర్తిచేయాలని ఆదేశించారు. 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ నాడు-నేడు అమలు చేయాలన్నారు. అంగన్‌వాడీలను వైఎస్సార్‌ ప్రీపైమరీ స్కూల్స్‌à°—à°¾ మార్చబోతున్నట్టు తెలిపారు. 

 

కొవిడ్‌-19పై నిర్లక్ష్యం వద్దని నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు సీఎం జగన్‌ సూచించారు. కరోనాతో కలసి జీవించాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులన్నింటిలోనూ కొవిడ్‌-19 పరీక్షలు జరపాలన్నారు. ఆర్‌టీపీసీఆర్‌, ట్రూనాట్‌ టెస్టుల నమూనాలు తీసుకున్న 24 గంటల్లో, ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించిన 30 నిమిషాల్లో ఫలితాలు వెల్లడి కావాల్సిందేనని సీఎం ఆదేశించారు. మరో వారంలో రెగ్యులర్‌ పోస్టుల భర్తీని పూర్తి చేస్తామన్నారు. ఇక, గ్రామ, వార్డు సచివాలయాల్లో బయోమెట్రిక్‌ హాజరును అమలు చేస్తున్నట్టు సీఎం జగన్‌ చెప్పారు. గ్రామ వలంటీర్లు కనీసం వారంలో మూడు రోజులైనా సచివాలయానికి హాజరు కావాలని స్పష్టంచేశారు. ఇసుక, మద్యం అక్రమ రవాణ, నిల్వలపై à°•à° à°¿à°¨ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలను సీఎం జగన్‌ ఆదేశించారు.

 

‘‘చీఫ్‌మినిస్టర్‌ ఈజ్‌ విత్‌ యూ. ఎనీథింగ్‌ ఇల్లీగల్‌ ప్లీజ్‌ డోంట్‌ హెజిటేట్‌’’ అని చెప్పారు. మద్యం ధరలు తగ్గించినా అక్రమ రవాణా ఇంకా కొనసాగుతోందని, దీనిని ఉపేక్షించవద్దని సూచించారు. అట్టడుగు వర్గాల కేసులకు సంబంధించి పోలీసులు అనుసరిస్తున్న విధానం, వ్యహరించిన తీరు బాగుందని పత్రికల్లో చదివానని సీఎం చెప్పారు. à°ˆ సందర్భంగా ఎస్పీలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.