రఘురామరాజుకు బాలినేని సవాల్‌

Published: Saturday September 12, 2020

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో చేసిన సవాల్‌కు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో స్పందిస్తూ ప్రతి సవాల్‌ విసిరారు. ‘‘తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలుకుతూ మాట్లాడటం కాదు... దమ్ము, ధైర్యం ఉంటే ఎంపీ పదవికి రాజీనామా చేసి మరొక పార్టీలో పోటీచేసి గెలవాలి’’ అని మంత్రి బాలినేని శుక్రవారం ఒంగోలులో మీడియా సమావేశంలో సవాల్‌ విసిరారు. రఘురామకృష్ణంరాజు మొదట్లో వైసీపీలో చేరారనీ, à°† తర్వాత టీడీపీ, à°† తర్వాత బీజీపీలో చేరి ఎన్నికల సమయంలో తిరిగి వైసీపీలోకి వచ్చారని అన్నారు. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి à°Ÿà°¿ క్కెట్‌ ఇవ్వడం వల్లే ఎంపీగా గెలిచాననే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. à°’à°• పార్టీలో గెలిచి మరో పార్టీకి వత్తాసు పలుకుతున్న ఆయన తన పదవికి రాజీనామా చేయాలన్నారు.

 

దీనిపై స్పందించిన ఎంపీ... ‘‘నేను నా పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో నెగ్గితే... అమరావతినే రాజధానిగా కొనసాగిస్తానని మీ సీఎం రాత పూర్వకంగా హామీ ఇచ్చేందుకు సిద్ధమేనా? నా చాలెంజ్‌ను స్వీకరిస్తే రాజీనామా చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నా. ఉప ఎన్నికను అమరావతిపై రిఫరెండంగా స్వీకరించేందుకు మీ సీఎం సిద్ధమేనా?’’ అని రఘురామకృష్ణంరాజు ప్రతి సవాల్‌ విసిరారు. తమ పార్టీకి చెడ్డ పేరు రావద్దన్న ఉద్దేశంతోనే తాను అమరావతినే ఏపీ రాజధానిగా ఉండాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నానని రఘురామ అన్నారు.