మరో లక్ష మంది అమెరికన్లకు ఉద్యోగాలు

Published: Monday September 14, 2020

ప్రముఖ రిటైల్ దిగ్గజం అమెజాన్ à°ˆ ఏడాది చివరిలోగా మరో లక్ష మంది అమెరికన్లకు తమ సంస్థలో ఉద్యోగం కల్పించనున్నట్టు తాజాగా ప్రకటించింది. అమెరికా, కెనడాలోని తమ సంస్థలలో పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ ఉద్యోగాలను కల్పించనున్నట్టు సంస్థ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు, మరణాలు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. à°ˆ నేపథ్యంలో అమెరికా వ్యాప్తంగా à°ˆ-కామర్స్ రంగానికి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో అమెజాన్‌కు ఉద్యోగుల అవసరం కూడా పెరుగుతూ వెళ్తోంది. à°ˆ నెల ప్రారంభం కానున్న వంద వేర్‌హౌస్‌, ఆపరేషన్స్ సైట్లలో అమెరికన్లను అమెజాన్ సంస్థ నియమించనుంది. 

 

 

ఇదిలా ఉంటే.. తాము కొత్తగా నిర్మిస్తున్న సైట్లలో ఆటోమేషన్‌(యంత్రాలను ఉపయోగించుకోవడం)ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు గ్లోబల్ కస్టమర్ ఫుల్‌ఫిల్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ అలీషియా బోలర్ డేవిస్ అన్నారు. అయితే ఆటోమేషన్ వల్ల వేర్‌హౌస్‌లో ఉద్యోగుల సంఖ్య తగ్గే అవకాశం ఉందా అనే దానిపై ఆమె స్పందించలేదు. అవసరమైన చోట తాము టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తున్నామని ఆమె అన్నారు. కాగా.. అమెజాన్ సంస్థ à°ˆ ఏడాదిలో ఇప్పటికే లక్షలాది మంది ఉద్యోగులను నియమించింది. మార్చి, ఏప్రిల్ నెలలో అమెజాన్ లక్షా 75 వేల మందిని ఆపరేషన్స్ కోసం నియమించుకుంది. à°ˆ నెల ప్రారంభంలో మరో 33 వేల మందిని కార్పొరేట్, టెక్నాలజీ వర్కర్లను నియమించనున్నట్టు తెలిపింది. 

ఇప్పుడు మరోమారు లక్ష మందిని తీసుకోనున్నట్టు ప్రకటించడంతో.. కరోనా సమయంలోనూ అమెజాన్‌ ఏ విధంగా దూసుకుపోతోందో అర్థం చేసుకోవచ్చు. కరోనా దెబ్బకు ప్రపంచ కుబేరులు వేల కోట్లు నష్టపోతే.. అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ నికర ఆస్తుల విలువ మాత్రం అంతకంతకూ పెరుగుతూ పోయింది. à°—à°¤ త్రైమాసికంలోనే అమెజాన్ ఆదాయం 40 శాతం పెరిగింది. జెఫ్ బెజోస్ నికర ఆస్తుల విలువ సోమవారం నాటికి 183.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ధనవంతుడిగా జెఫ్ బెజోస్ మొదటి స్థానంలో ఉన్నారు.