వైసీపీ ఎంపీలకు జగన్‌ నిర్దేశం

Published: Tuesday September 15, 2020

కేంద్రం నుంచి రావలసిన నిధులను రాబట్టేలా, పెండింగ్‌ ప్రాజెక్టులకు అనుమతులు సాధించేలా పార్లమెంటులో గళమెత్తాలని వైసీపీ ఎంపీలకు à°† పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించాలని కోరారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఆయన అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఢిల్లీ నుంచి వారు పాల్గొన్నారు. à°ˆ భేటీలో పార్లమెంటరీ పార్టీనేత విజయసాయిరెడ్డి, లోక్‌సభలో నేత మిథున్‌రెడ్డితోపాటు ఢిల్లీ చేరిన ఎంపీలు పాల్గొన్నారు. కొంతకాలంగా అధినేతపైనా, వైసీపీ ప్రభుత్వంపైనా అసమ్మతి స్వరం వినిపిస్తున్న à°† పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సోమవారం ఢిల్లీలోనే ఉన్నా, à°ˆ భేటీకి ఆయనను ఆహ్వానించలేదని సమాచారం. పార్లమెంటు సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహరచనపై వైసీపీ ఎంపీలకు జగన్‌ దిశానిర్దేశం చేశారు. అలాగే, రాష్ర్టానికి రావలసిన జీఎస్టీ బకాయిలు, కేంద్ర ప్రాయోజిత పథకాల నిఽధులు, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రావలసిన నిధుల విషయమై ఎంపీలంతా పార్లమెంటులో ప్రస్తావించాలని సూచించారు. అంతకు ముందు వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి అధ్యక్షతన ఏపీ భవన్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్లమెంటు సమావేశాల్లో వైసీపీ తరఫున అనుసరించాల్సిన వ్యూహంపై వారంతా చర్చించారు. 

 

ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు ఆంధ్రాభవన్‌ అధికారులు తొలుత తనను ఆహ్వానించారని, తర్వాత ఏమనుకున్నారో ఏమోగానీ తిరిగి ఫోన్‌ చేసి.. రావద్దని చెప్పారని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలిపారు. పిలిచినట్టే పిలిచి అంతలోనే వద్దనడం ఏమిటని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. à°ˆ పరిణామంతో తనను వైసీపీ నుంచి బహిష్కరించినట్టే భావిస్తున్నానన్న ఆయన, అలాగని తాను తన పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని మరోసారి స్పష్టం చేశారు. ‘‘అమరావతిలోనే రాజధాని ఉంటుందని కొందరు కుహనా నేతలు అక్కడ రైతులను, రాష్ట్ర ప్రజలను నమ్మించారు. à°† తర్వాత à°† నేతలు ఇచ్చిన మాట తప్పి, మడమ తిప్పారు’ అని తూర్పారబట్టారు.