ఆర్టీసీ చర్చల్లో అదే ప్రతిష్టంభన

Published: Wednesday September 16, 2020

తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు ఇప్పట్లో తిరిగే పరిస్థితి కనిపించడంలేదు. లాక్‌డౌన్‌తో మార్చి చివరి వారం నుంచి ఆగిన బస్సులు.. కొన్ని రోజులుగా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, ఒడిసాకు వెళుతున్నాయి. కానీ తెలంగాణకు మాత్రం నడవడంలేదు. తమ రాష్ట్రంలో లక్ష కిలోమీటర్లు ఎక్కువగా తిప్పుతున్న సర్వీసులను రద్దు చేయాలని.. అప్పుడే అంతర్రాష్ట్ర ఒప్పందానికి ముందుకొస్తామని తెలంగాణ పట్టుబడుతోందే తప్ప.. ‘మేం 50వేలు తగ్గించుకుంటాం.. మీరు 50వేలు పెంచుకోండి’ అని ఏపీ చేస్తున్న ప్రతిపాదనకు ఒప్పుకోవడంలేదు. దీంతో ఇటీవల జరిగిన ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల స్థాయి చర్చలు కొలిక్కి రాలేదు. తాజాగా మంగళవారం ఇరు రాష్ట్రాల రవాణాశాఖ ముఖ్య కార్యదర్శులు à°Žà°‚. à°Ÿà°¿. కృష్ణబాబు(ఏపీ), సునీల్‌ శర్మ(తెలంగాణ) మధ్య హైదరాబాద్‌లో చర్చ లు జరిగాయి. ఏపీ ప్రతిపాదనపై తెలంగాణ పాతపాటే పాడటంతో మరోసారి  చర్చలు అర్ధంతరంగా ముగిశాయి. à°ˆ సమస్యకు త్వరలో పరిష్కా à°°à°‚ లభిస్తుందని, త్వరలో మరో ప్రతిపాదనతో చర్చలు జరుగుతాయని ఏపీఎ్‌సఆర్టీసీ ఆపరేషన్స్‌ఈడీ బ్రహ్మానంద రెడ్డి అన్నారు.