వెండిదో.. కాదో.. ఊడదీసి చూడాలట!

Published: Friday September 18, 2020

అది... వెండి ఉత్సవ రథం! దాదాపు 20 ఏళ్ల కిందట బెజవాడ కనక దుర్గమ్మ కోసం తయారుచేయించారు. కానీ... ఇప్పుడు, ఇన్నేళ్లకు స్వయంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారికే సందేహం వచ్చింది. రథానికి ఉన్న మూడు వెండి సింహాలు చోరీ అయ్యాయని అంగీకరించేందుకు ఎంతమాత్రం ఇష్టపడని ఆయన... చివరికి, ‘అవి వెండివో, కావో’ అంటూ వింత వ్యాఖ్యలు చేశారు. దుర్గగుడి ఈవో సురేశ్‌ బాబు గురువారం మీడియాతో మాట్లాడారు. ‘‘దుర్గమ్మ ఉత్సవ రథంపై మాయమైన సింహాలు అసలు నిజంగా వెండివా, కాదా.. అన్నది తేలాల్సి ఉంది. రథం నల్లగా ఉంది. నాకు వెండి రథం అని అప్పగించారు. సుమారు 250 కేజీల బరువున్న రథాన్ని18ఏళ్ల క్రితం తయారు చేశారు. ఇప్పుడు à°Šà°¡à°¿à°¨ విగ్రహాన్నే చూశారుగా... à°Žà°‚à°¤ నల్లగా ఉందో! అది వెండో కాదో పరీక్షించాల్సి ఉంది. ఊడదీసి తూకం వేసి పరిశీలించాల్సి ఉంది’’ అని తెలిపారు. ఈవోతోపాటు దేవస్థానం పాలకమండలి చైర్మన్‌ కూడా మీడియాతో మాట్లాడారు. సింహ విగ్రహాలు తమ హయాంలో పోనేపోలేదని తేల్చిచెప్పారు. ‘‘ 2019 ఏప్రిల్‌లో రథాన్ని చివరిసారి వినియోగించారు. టీడీపీ హయాంలోనే సింహాలు పోయి ఉండొచ్చు. మా హయాంలో పోలేదు’’ అని తెలిపారు. 

వెండి రథంపై అమర్చిన నాలుగు సింహం విగ్రహాల్లో మూడు చోరీకి గురయ్యాయని ఆలయ అధికారులు ఎట్టకేలకు అంగీకరించారు. గుర్తు తెలియని వ్యక్తులు 3 సింహం విగ్రహాలు అపహరించారని దేవస్థానం సహాయ కార్యనిర్వహణాధికారి ఎన్‌.రమేశ్‌ విజయవాడ వన్‌టౌన్‌ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. à°ˆ ఘటనపై విచారణ అధికారిగా నియమితులైన పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవస్థానం ఈవో ఎన్‌.వి.ఎ్‌à°¸.మూర్తి పర్యవేక్షణలో దుర్గగుడి అధికారులు దేవస్థానం స్ట్రాంగ్‌ రూంలో, విలువైన వస్తువులు భద్రపరిచే ఇతర ప్రాంతాల్లో వెతికినా వెండి సింహం విగ్రహాలు కనిపించకపోవడంతో అవి చోరీకి గురైనట్టు నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు. రథాన్ని చివరిసారి ఉత్సవాల్లో ఉపయోగించిన 2019 ఏప్రిల్‌ 6 నుంచి 2020 సెప్టెంబరు 15 మధ్యకాలంలో చోరీ జరినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, పోలీసులు ఇంకా దర్యాప్తు ప్రారంభించకుండానే ఇంద్రకీలాద్రిపై భద్రతను పర్యవేక్షిస్తున్న ప్రైవేటు సెక్యూరిటీ సంస్థ నిర్లక్ష్యమే à°ˆ చోరీకి ప్రధాన కారణమంటూ నెపాన్ని à°† సంస్థపైకి నెట్టేసేందుకు దేవస్థానం అధికారులు à°°à°‚à°—à°‚ సిద్ధం చేశారు. ఘటనకు బాధ్యత వహిస్తూ మూడు వెండి సింహం విగ్రహాలతో పాటు దెబ్బతిన్న నాలుగో దాని స్థానంలోనూ కొత్తవాటిని వెండితో తయారు చేయించి అమర్చాలని, వెండి రథం మొత్తాన్ని పాలిష్‌ చేయించి కొత్తది మాదిరిగా తీర్చిదిద్దాలని, ఇందుకయ్యే ఖర్చు మొత్తాన్ని భరించాలంటూ ప్రైవేటు సెక్యూరిటీ సంస్థ యాజమాన్యంతో లిఖితపూర్వకంగా అంగీకార పత్రం రాయించుకున్నారు. కాగా, చోరీకి గురైన ఒక్కో వెండి సింహం బరువు 3.365 కిలోలుగా దేవస్థానం రికార్డుల్లో నమోదై ఉంది.

 

à°ˆ చోరీ ఘటనపై దేవస్థానం తరపున నియమించిన అంతర్గత కమిటీ విచారణ సభ్యులు గురువారం అమ్మవారి వెండి రథానికి ఉన్న ఒక్క సింహం విగ్రహాన్ని అధికారుల సమక్షంలో ఊడతీసి తూకం వేయించగా.. దాని బరువు 3.244 కిలోలు ఉంది. à°ˆ లెక్కన చోరీకి గురైన 3 విగ్రహాల వెండి బరువు 10కేజీల పైనే ఉంటుందని లెక్క తేల్చారు. దేవస్థానంలో నిర్వహిస్తున్న ఇన్వెంటరీ రిజిస్టరు ప్రకారం అమ్మవారికి వెండి రథాన్ని 2002, ఏప్రిల్‌ 15à°¨ అప్పటి దుర్గగుడి ఉన్నతాధికారులు తయారు చేయించారు. అప్పట్లో కేజీ వెండి ధర 8 వేలుగా అంచనా వేశారు. à°ˆ లెక్కన చోరీ అయిన 3 వెండి సింహాల విలువ రూ.80,760కాగా.. ప్రస్తుత ధరల ప్రకారం చోరీ సొత్తు విలువ రూ.7లక్షలు పైనే ఉంటుంది.