పెట్రోల్‌, డీజిల్‌పై సెస్‌పైనా వ్యాట్‌

Published: Tuesday September 22, 2020

ప్రభుత్వాలు పన్నులు వేయడం చూశాం. కానీ, పన్నుపైనా పన్ను వేయడం ఎప్పుడైనా చూశారా? ఏపీలో వైసీపీ సర్కారు ఇప్పుడు అదే చేసింది. ప్రజాప్రయోజనార్థం భారం మోపక తప్పడం లేదంటూ ఇటీవల పెట్రోలు, డీజిల్‌పై రూపాయి ‘రోడ్‌ డెవల్‌పమెంట్‌ సెస్‌’ విధించిన ప్రభుత్వం à°† రూపాయిపైనా వ్యాట్‌ వేసిన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అదేం à°Ÿà°¿ ప్రభుత్వం పెంచింది రూపాయే కదా అనుకుంటున్నారా? ప్రభుత్వం సెస్‌ విధించింది రూ పాయే.

 

కానీ, దాన్ని విడిగా చూపకుండా పెట్రో లు, డీజిల్‌ ‘బేసిక్‌ ప్రైస్‌’పై వేసింది. దీంతో పెట్రోలుపై 31ు, డీజిల్‌పై 22.25ు విధించే వ్యాట్‌ దీనిపైనా పడింది. చివరికి వినియోగదారుడిపై పెట్రోలు లీటరుకు రూ.1.32, డీజిల్‌పై రూ.1.22 భారం పడింది. సింపుల్‌à°—à°¾ చెప్పాలం టే రూపాయి అని చెప్పి పెట్రోలుపై మరో 32 పైసలు, డీజిల్‌పై మరో 22 పైసలు వసూలు చేస్తోంది.

 

అంటే ఏడాదికి సగటున మరో రూ.125 కోట్లు సర్కారుకు ఆదాయం వస్తుంది. రూపాయి సెస్‌ విధించడం వల్ల రూ.500 కోట్లు అదనపు ఆదాయం వస్తుందని ప్రభు త్వం ప్రకటించగా, à°ˆ లొసుగులతో అది రూ. 625 కోట్లు అవుతుంది. à°ˆ విషయాలేవీ ప్రజల కు తెలియకుండా ప్రభుత్వం తెలివిగా రూ పాయి సెస్‌ అంటూ సరిపెట్టేసింది.