ఏపీలో కొత్తగా 7,553 కరోనా కేసులు

Published: Tuesday September 22, 2020

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ మునుపటితో పోలిస్తే.. కాస్త తగ్గుముఖం పట్టింది. ఇదివరకు రోజులో 10వేలకు పైగానే కేసులు నమోదవుతుండేవి.. ఇప్పుడు మాత్రం చాలా వరకు పాజిటివ్ కేసులు తగ్గాయి. à°—à°¤ 24 గంటల్లో ఏపీలో కొత్తగా 7,553 కరోనా కేసులు నమోదయ్యాయయని రాష్ట్ర ఆరోగ్యశాఖ మీడియా బులెటిన్‌లో వెల్లడించింది. తాజాగా నమోదైన కేసులతో కలిపితే రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,39,302à°•à°¿ చేరింది.

 

 

గత 24 గంటల్లో 51 మరణాలు సంభవించగా.. మొత్తం మరణాల సంఖ్య 5,461కు చేరింది. ప్రస్తుతం ఏపీలో 71,465 యాక్టివ్ కేసులుండగా.. 5,62,376 మంది రికవరీ అయ్యారు. ఇప్పటి వరకూ ఏపీలో 52.29 లక్షల కరోనా టెస్టులు జరిగాయని ఆరోగ్యశాఖ తెలిపింది. చిత్తూరులో 8, అనంతపురంలో, విశాఖ జిల్లాల్లో ఆరుగురు చొప్పున మృతి చెందారు.

 

కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఐదుగురు చొప్పున.. తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు. గుంటూరు, à°•à°¡à°ª, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందినట్లు మీడియా బులెటిన్‌లో పేర్కొంది. శ్రీకాకుళం జిల్లాలో ఒకరు మాత్రమే మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసుల్లో తూర్పు గోదావరిలో 1166, పశ్చిమ గోదావరిలో 989, చిత్తూరు జిల్లాలో 902 కేసులు నమోదయ్యాయి.