ఎన్‌డీబీ టెండర్లపై సీవీసీకి ఫిర్యాదు

Published: Thursday September 24, 2020

రాష్ట్రంలో రూ.6,400 కోట్ల వ్యయంతో రహదారి ప్రాజెక్టులకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఇందులో 70 శాతం ఎన్‌డీబీ ఆర్థిక సాయం. మిగతా 30 శాతం వాటా ప్రభుత్వం భరిస్తాయి. తొలి దశలో రూ.2,978 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచారు. జిల్లాను à°’à°• ప్యాకేజీగా విభజించి నిర్వహించిన టెండర్ల నిబంధనలపై తొలి నుంచీ ఆరోపణలు, విమర్శలు చేలరేగాయి. పెద్దలకు మాత్రమే టెండర్లు దక్కేలా చక్రం తిప్పారని.. మూడు పనుల కోసం à°“ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే, అధికార పార్టీకి సన్నిహితంగా ఉన్న కొందరు టెండర్లు వేశారని ‘ఆంధ్రజ్యోతి’ వరుసల కథనాలను ప్రచురించింది. పునరాలోచనలో పడిన ప్రభుత్వం.. టెండర్లను రద్దుచేయడం విదితమే.

 

à°ˆ టెండర్లలో అర్హత లేని à°“ కంపెనీకి బిడ్‌ దాఖలు అవకాశం కల్పించారన్న అంశంపై వివాదం చెలరేగుతోంది. à°† కంపెనీ రాయలసీమలో à°“ మంత్రి కుటుంబానికి చెందిన ఏజెన్సీతో కలిసి జాయింట్‌ వెంచర్‌ à°•à°¿à°‚à°¦ బిడ్‌ దాఖలు చేసింది. à°† పనుల విలువ 378.73 కోట్లు. మొత్తం రాయలసీమ పనుల్లో ఇది సగం. ‘నిర్దేశిత కాంట్రాక్టు ప్యాకేజీ విలువలో అంతకుముందు కనీసం 40 శాతం పని అయినా చేసి ఉండాలి’ అన్న నిబంధన ఉంది. దీని ప్రకారం కూడా అర్హత లేని కంపెనీ జాయింట్‌ వెంచర్‌ à°•à°¿à°‚à°¦ మూడు పనులకు బిడ్లు వేసిందన్నది ఆరోపణ. దీనిపై ఫిర్యాదు చేసినా ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టించుకోలేదని, సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ సీవీసీకి à°ˆ నెల 16à°¨ ఫిర్యాదులు వెళ్లాయి.

 

à°† తర్వాత 18à°¨ మరో రెండు ఫిర్యాదులు కమిషన్‌కు అందాయి. ఇందులో రెండు కాంట్రాక్టు సంస్థలు చేయగా... ఇంకొకటి విజిల్‌ బ్లోయర్‌ ఫిర్యాదు à°•à°¿à°‚à°¦ వెళ్లినట్లు తెలిసింది. ఇలా విజిల్‌ బ్లోయర్‌ à°•à°¿à°‚à°¦ ఫిర్యాదు వెళ్లడమే కీలకమైన అంశంగా మారింది. ఎన్‌డీబీ టెండర్‌నిబంధనలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీ చరిత్ర, అది సమర్పించిన పనుల జాబితాలు, సర్టిఫికెట్లను జతచేసి.. అర్హత లేకున్నా దాని నుంచి అధికారులు బిడ్లు తీసుకుని పరిశీలించారని విజిల్‌ బ్లోయర్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. రాయలసీమ టెండర్లు ముగిసిన రెండో రోజే à°† కంపెనీ అర్హతను సవాల్‌ చేస్తూ ఫిర్యాదులు వచ్చాయని, రాష్ట్రం మొత్తం టెండర్ల ప్రక్రియ ముగిసేదాకా అధికారులు వాటిని పట్టించుకోలేదని అందులో ప్రస్తావించారు.

 

’తొలి దశలోనే బిడ్లను పరిశీలిస్తే à°† కంపెనీ అర్హతలపై వచ్చిన ఆరోపణలు నిజమో కాదో నిగ్గు తేల్చవచ్చు. కానీ అలా చేయలేదు. అయితే à°† ఫిర్యాదును తొక్కిపెట్టాలని అధికారులపై ఉన్నత స్థాయిలో ఒత్తిళ్లు వచ్చాయి. అందుకే పత్రాల పరిశీలన ముందుకు సాగలేదు’ అని విజిల్‌ బ్లోయర్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. అందిన మూడు ఫిర్యాదులకు సీవీసీ సమాధానం ఇచ్చింది. విజిల్‌ బ్లోయర్‌ ఫిర్యాదులోనే ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు పేర్కొంది. వాటి ఆధారంగా విచారణ చేపడతామని చెప్పినట్లు సమాచారం. మరోవైపు.. ఇప్పటికే à°ˆ టెండర్లపై నివేదిక కోరుతూ ఆర్‌అండ్‌బీకీ సీవీసీ నుంచి లేఖ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.