బాలు మృతికి సంతాపం!

Published: Friday September 25, 2020

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకున్న కొన్ని కోట్ల మంది ప్రార్థనలు ఫలించలేదు. సంగీత ప్రియులను శోక సంద్రంలో ముంచి బాలు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. à°ˆ నేపథ్యంలో పలువురు రాజకీయ, సీనీ ప్రముఖులు కన్నీళ్లతోనే బాలుకు నివాళులు అర్పిస్తున్నారు. 

 

ఎస్పీ బాలసుబ్రహ్యణం మరణంతో మన కళా ప్రపంచం గొప్ప వ్యక్తిని కోల్పోయింది. ప్రతి ఇంట్లోనూ ఆయన గళం కొన్ని దశాబ్దాల పాటు అలరించింది. à°ˆ విచారకర సమయంలో వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.    -ప్రధాని మోదీ

 

దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిది. గాయకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా సినీ లోకానికి ఆయన అందించిన సేవలు మరువలేనివి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి       -తెలంగాణ సీఎం కేసీఆర్

 

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు ఇక లేరన్నవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. 16 భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను.        -ఏపీ సీఎం జగన్

 

కోట్లాది హృదయాలు వేడుకున్నా విధి కరుణించలేదు. బాలసుబ్రహ్మణ్యంగారు ఇక లేరన్న వార్త వినడానికే బాధాకరంగా ఉంది. ఆయన మరణంతో à°’à°• అద్భుత సినీ శకం ముగిసింది. ఇది దేశ చలనచిత్ర రంగానికి తీరనిలోటు. బాలసుబ్రహ్మణ్యంగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.              -టీడీపీ అధినేత చంద్రబాబు

 

సంగీత ప్రపంచానికి చీకటి రోజు. సంగీత జ్ఞాని ఎస్పీ బాలసుబ్రహ్మణం మృతితో à°“ శకం ముగిసింది. నాకు బాలుగారు ఎన్నో పాటలు పాడారు. నా విజయంలో ఆయన గాత్రానికి కూడా ప్రధాన పాత్ర ఇవ్వాలి.       -చిరంజీవి

 

బాలుగారి ఆత్మకు శాంతి చేకూరాలి. ఎన్నో ఏళ్లు ఆయన నాకు గాత్రధానం చేశారు. మీరు, మీ వాయిస్ నాకు ఎప్పటికీ గుర్తుంటాయి. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా     -రజినీకాంత్

 

బాలుగారితో నా అనుభవాలు, సంభాషణలు కన్నీళ్ల రూపంలో వస్తున్నాయి. `అన్నమయ్య` చూసిన తర్వాత ఆయన చేసిన ఫోన్ కాల్ నాకు ఇప్పటికీ గుర్తుంది. దాచుకో స్వామి మా బాలుని జాగ్రత్తగా దాచుకో    -నాగార్జున

 

నాకు అత్యంత ఆత్మీయుడు, ఆప్తమిత్రుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మణ్యంగారు.   à°¶à±à°°à±€‌కాళ‌à°¹‌స్తిలో మొద‌లైన మా స్నేహం, ఆత్మీయ‌à°¤ చెన్నైలోనూ కొన‌సాగింది. ఆయ‌à°¨ ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత గాయ‌కుడు. అన్ని దేవుళ్ల పాట‌లు పాడి à°† దేవుళ్లనందరినీ మెప్పించిన గాన గంధర్వుడు. అలాంటి దిగ్గ‌à°œ గాయ‌కుడిని కోల్పోవ‌à°¡à°‚ యావ‌త్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకే కాదు, యావ‌త్‌ దేశానికీ ఎంతో బాధాక‌à°°à°‚. నాకు వ్య‌క్తిగ‌తంగా ఎంతో లోటు.           -మోహన్ బాబు

 

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు. కేరీర్ ప్రారంభం నుంచే బాలసుబ్రహ్మణ్యంతో ప్రయాణించా. నా పాటలకు ఊపిరి పోశారు. ఆయన ఊపిరితోనే ఇంత ఎదిగాను.     -సంగీత దర్శకుడు కోటి

 

తెలుగు వారి ఆరాధ్య స్వరం మూగబోయింది. భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు అనే వార్త తీవ్రంగా కలచివేసింది. à°ˆ భువిలో సంగీతం ఉన్నంత కాలం మీరు అమరులే.       -ఎన్టీయార్

 

బాలు గారు ఇక లేరు అనటం తప్పు. పాట ఉన్నంత కాలం ఆయన మన మధ్యే ఉంటారు. కాని ఆయన ఇక పాట పాడరు అనే విషయమే జీర్ణించుకోలేని నిజం. గానగంధర్వుడికి శోకతప్త హృదయంతో అశృ నివాళులు     -కొరటాల శివ

 

ఈరోజు మనం à°’à°• లెజెండ్‌ను కోల్పోయాం. `ప్రేమ`, `పవిత్రబంధం` వంటి చిత్రాల్లో ఆయనతో కలిసి నటించే గౌరవాన్ని దక్కించుకున్నాను. మీ లెగసీ ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి       -వెంకటేష్

 

à°“ శకం ముగిసింది. సంగీతం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రపంచం ఒకేలా ఉండదు. సావిత్రమ్మ, చరణ్‌, పల్లవి, ఇతర కుటుంబ సభ్యులకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను        -గాయని చిత్ర

 

బాలుగారు తెలుగు, తమిళం, కన్నడ భాషల సంగీత ప్రపంచాన్ని కొన్ని దశాబ్దాల పాటు ఏక ఛత్రాధిపత్యంగా పాలించారు. ప్రపంచంలో మరెక్కడా ఇటువంటి అద్భుతం జరగలేదు. à°† ఏలిక మరి రాదు. ఆయన పాడిన పాటలు మిగిల్చిన అనుభూతులు తరతరాలకీ కొనసాగుతాయి. మహోన్నతమైన ఆయన గాత్రానికి భక్తి ప్రపత్తులతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.          -రాజమౌళి