5,663కు చేరిన కరోనా మరణాలు

Published: Sunday September 27, 2020

రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. శుక్రవారం 75,990 మందికి పరీక్షలు నిర్వహించగా 7,293 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయిందని ఆరోగ్యశాఖ శనివారం ప్రకటించింది. వీటితోకలిపి మొత్తం పాజిటివ్‌లు 6,68,751à°•à°¿ చేరాయి. తాజాగా 9,125 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ 5,97,294 మంది డిశ్చార్జి అయ్యారు. ఇంకా 65,794 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకూ 57మంది మృత్యువాత పడ్డారు. దీంతో కరోనా మరణాలు 5,663కు పెరిగాయి. తూర్పుగోదావరి జిల్లాలో మరో 1,011మందికి కొవిడ్‌ సోకింది. దీంతో మొత్తం పాజిటివ్‌à°² సంఖ్య 93,184కు, మరణాల సంఖ్య 507కు చేరాయి. అనంతపురం జిల్లాలో మరో 513మందికి పాజిటివ్‌à°—à°¾ నిర్ధారణ అయింది. కృష్ణాజిల్లాలో కొత్తగా 450 మందికి కరోనా సోకింది. విజయనగరం జిల్లాలో 444 కేసులు, శ్రీకాకుళం జిల్లాలో  306 కేసులు, పశ్చిమగోదావరి జిల్లాలో 1,083 కేసులు, కర్నూలు జిల్లాలో 206 కేసులు, à°•à°¡à°ª జిల్లాలో 537 కేసులు, గుంటూరు జిల్లాలో 393 కేసులు, విశాఖ జిల్లాలో 450 కేసులు, నెల్లూరు జిల్లాలో 466 కేసులు, చిత్తూరు జిల్లాలో 975 కేసులు శనివారం నమోదయ్యాయి.  

సచివాలయంలో శనివారం మరో 17మంది ఉద్యోగులకు కరోనా సోకింది. నాలుగో బ్లాకులోని ఉన్నత విద్యాశాఖలో డిప్యూటీ సెక్రటరీ, ఏఎ్‌సవో, జలవనరుల శాఖలో సెక్షన్‌  అధికారి, జీఏడీలో ఎస్‌వో, ఇద్దరు ఎస్పీఎఫ్‌ కానిస్టేబుళ్లకు, పలు బ్లాకుల్లోని వివిధ శాఖలో పనిచేస్తున్న మరో 11మంది ఉద్యోగులకు పాజిటివ్‌à°—à°¾ నిర్ధారణ అయింది. దీంతో సచివాలయం, అసెంబ్లీల్లో కలిపి మొత్తం కేసుల సంఖ్య 180à°•à°¿ చేరింది. సచివాలయంలోని వివిధ బ్లాకుల్లో వందల మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తూ ఉంటారని.. శానిటైజేషన్‌  కార్యక్రమం క్రమం తప్పకుండా చేపట్టాలని ఉద్యోగులు కోరుతున్నారు.