ఏపీ, తెలంగాణ మధ్య అంతర్రాష్ట్ర పర్మిట్ల చిచ్చు

Published: Monday September 28, 2020

ప్రజా రవాణాను ఉభయ తెలుగు ప్రభుత్వాలు గాలికొదిలేస్తున్నాయి. ఏపీ, తెలంగాణ మధ్య బస్సుల పునరుద్ధరణపై రెండు రాష్ర్టాల ఆర్టీసీ ఎండీలు, రవాణా శాఖ ఉన్నతాధికారులు, చివరకు మంత్రులు కూడా రంగంలోకి దిగినా సమస్య తీరలేదు. à°ˆ అంశంపై సీఎంల స్థాయిలో చర్చిస్తే తప్ప పరిష్కారం లభించేలా కనిపించడం లేదు. రెండు రాష్ర్టాల మధ్య నెలకొన్న ఇంటర్‌ స్టేట్‌ పర్మిట్ల వివాదం తెలంగాణ ప్రైవేటు ఆపరేటర్లకు కాసులు కురిపిస్తోంది. à°ˆ పరిణామం రెండు రాష్ర్టాల రోడ్డు రవాణా సంస్థలకు శాపంగా మారుతోందన్న ఆందోళన ఉంది. విపరీతమైన డిమాండ్‌ ఉన్న విజయవాడ-హైదరాబాద్‌  రూట్‌లో అటు తెలంగాణ నుంచి ఇటు ఏపీ నుంచి బస్సులు తిరగకపోవటంతో రెండు రవాణా సంస్థలు భారీగా ఆదాయం కోల్పోతున్నాయి. 

ప్రస్తుతం విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లాలంటే ముందుగా తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న జగ్గయ్యపేట వరకు వెళ్లాలి. అక్కడ దిగిన ప్రయాణికులు కోదాడకుచేరుకుని అక్కడి నుంచి ప్రైవేటు బస్సుల్లో హైదరాబాద్‌కు వెళ్తున్నారు. దీంతో జగ్గయ్యపేట వెళ్లే బస్సులు à°—à°¤ కొద్ది రోజులుగా ఫుల్‌ అవుతున్నాయి. అంతర్రాష్ట్ర పర్మిట్లపై తెలంగాణ ప్రభుత్వం పట్టుదలగా ఉంది. లాక్‌డౌన్‌ సందర్భంగా బస్సులు నిలుపుదల చేయడాన్ని అవకాశంగా తీసుకుని తిరిగి పునరుద్ధరించే విషయంలో డిమాండ్‌ చేసే ధోరణితో వ్యవహరిస్తోంది. విజయవాడ నుంచి 90 కిలోమీటర్ల వరకే ఏపీలో ఉండగా, మిగిలిన 200 కిలోమీటర్లు తెలంగాణ పరిధిలో ఉంది. తమ భూభాగంలో ఏపీ బస్సులు ఎక్కువ కిలోమీటర్లు తిరుగుతున్నాయన్నది à°† ప్రభుత్వ వాదనగా ఉంది. ఏపీ నుంచి రోజూ 2.60లక్షల కిలోమీటర్ల మేర తెలంగాణలో బస్సులు తిరుగుతున్నాయి. అక్కడినుంచి 1.52లక్షల కిలోమీటర్లే ఏపీలో తిరుగుతున్నాయి.

 

ఇంటర్‌ స్టేట్‌ అగ్రిమెంట్‌ చేసుకోవటం ద్వారా ఇరు రాష్ర్టాలు సమాన కిలోమీటర్లు నడపాలని తెలంగాణ వాదిస్తోంది. దీంతో ఏపీ లక్ష కిలోమీటర్లు తగ్గించుకోవాల్సి ఉంటుంది. అయితే 50వేల కిలోమీటర్లు చొప్పున ఇరు రాష్ట్రాలు తగ్గించుకోవాలని ఏపీ ప్రతిపాదించినా తెలంగాణ నుంచి సానుకూల స్పందన రాలేదు. ఏపీ నుంచి తెలంగాణాకు మొత్తం 71 రూట్లు ఉన్నాయి.

 

à°ˆ రూట్లన్నింటినీ ఏకీకృతంగా తీసుకోకుండా విజయవాడ -హైదరాబాద్‌ రూట్‌ విషయంలోనే తెలంగాణ గట్టి పట్టు పడుతోంది. ఏపీలో కోస్తా ప్రాంతం నుంచి 400స్లీపర్‌ బస్సుల ఫ్లీట్‌ను లాక్‌డౌన్‌కు ముందే ప్రైవేటు ఆపరేటర్లు సిద్ధం చేసుకున్నారు. తెలంగాణ వైపు కూడా ఫ్లీట్‌ను పెంచుకున్నారు. ఇలాంటి తరుణంలో విజయవాడ- హైదరాబాద్‌ మార్గంలో ప్రైవేటు ఆపరేటర్ల ఆధిపత్యం ఇటు ఏపీఎ్‌సఆర్‌టీసీ, అటు టీఎ్‌సఆర్‌టీసీకి కూడా మంచిది కాదనే అభిప్రాయాలున్నాయి. ఏపీలో 128 బస్సు డిపోలు ఉండగా.. 90 డిపోల నుంచి హైదరాబాద్‌కు బస్సులు ఉన్నాయి. దీనికి సమాంతరంగా రైల్వే నెట్‌వర్క్‌ కూడా ఉండటంతో హైదరాబాద్‌ రూట్‌లో బస్సులు తగ్గించుకుంటే ఏపీఎ్‌సఆర్‌టీసీకి మొదటికే మోసం వచ్చే పరిస్థితి ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు