అంత్యక్రియలు చేసేందుకూ జాగా లేదు

Published: Monday September 28, 2020

భారీ వర్షాలు à°“ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. సమయానికి వైద్యం అందక విశ్రాంత ఉద్యోగి గుండెపోటుతో కన్నుమూశాడు. కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం బ్రాహ్మణపల్లెలో à°ˆ సంఘటన జరిగింది. భారీ వర్షాలకు వక్కిలేరు పొంగి ప్రవహిస్తుండటంతో బ్రాహ్మణపల్లె వరద నీటిలో చిక్కుకుంది. గ్రామం నుంచి బయటకు వెళ్లేందుకు దారీతెన్నూ లేదు. à°ˆ పరిస్థితుల్లో ఎస్సీ కాలనీకి చెందిన గాలిపోతు థామస్‌ (65)కు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు ట్రాక్టర్‌లో రెండు కిలోమీటర్లు తీసుకెళ్లారు. అక్కడి నుంచి వాహనం వెళ్లే అవకాశం లేక.. మంచంపైనే మోస్తూ పొలాలు, వరద నీటిలో మరో రెండు కిలోమీటర్లు తీసుకెళ్లారు.

 

à°ˆ సమాచారం అందుకున్న చాగలమర్రి 108 వాహనం గొట్లూరు మీదుగా పొలాల రహదారి వరకూ వచ్చి ఆగింది. కుటుంబ సభ్యులు థామ్‌సను అంబులెన్స్‌ వద్దకు చేర్చినా.. అతడు అప్పటికే చనిపోయాడని 108 సిబ్బంది తెలిపారు. థామస్‌ ఆళ్లగడ్డ సహకార సంఘం బ్యాంకులో ఉద్యోగిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. గ్రామం చుట్టూ నీరు ఉండటంతో అంత్యక్రియలు చేసేందుకూ అవకాశం లేకపోయింది. మృతదేహాన్ని ఇంటి వద్దే ఉంచి.. కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.