2.30 గంటలకు హడావుడిగా దహనసంస్కారాలు

Published: Wednesday September 30, 2020

 à°‰à°¤à±à°¤à°°à°ªà±à°°à°¦à±‡à°¶à±‌లోని హత్రాస్‌లో గ్యాంగ్‌రేప్‌కు గురైన à°“ యువతి మృతదేహానికి పోలీసులు అర్ధరాత్రి 2.30 గంటలకు హడావుడిగా దహనసంస్కారాలు నిర్వహించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తల్లిదండ్రులకు కుమార్తెను కడసారి చూసే అవకాశం కూడా ఇవ్వకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 

కుటుంబసభ్యులను ఇళ్లలో ఉంచి తాళాలు వేసి.. బయటకు రానీయకుండా చేసి మరీ బాధిత యువతి మృతదేహాన్ని పోలీసులు దహనం చేయడం గమనార్హం. ఢిల్లీ ఆసుపత్రి నుంచి బాధిత యువతి మృతదేహాన్ని 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న హత్రాస్‌కు మంగళవారం రాత్రి తరలించారు. à°ˆ సందర్భంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. యువతి మృతదేహాన్ని తరలిస్తున్న అంబులెన్స్‌కు కొందరు మహిళలు అడ్డు తగిలారు.

 

యువతి మృతదేహాన్ని ఇంటికి తరలించాలని, ఉదయం దహన సంస్కారాలు నిర్వహిస్తామని బాధితురాలి తండ్రి చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. రాత్రి 12.45 నిమిషాలకు బాధితురాలి మృతదేహాన్ని హత్రాస్‌కు తరలించారు. మృతదేహాన్ని తక్షణమే దహనం చేయాల్సిందిగా కుటుంబ సభ్యులకు సూచించారు. వారు ఒప్పుకోకపోవడంతో రాత్రి 2.21 నిమిషాలకు బాధితురాలి మృతదేహాన్ని భారీ పోలీసు బందోబస్తు మధ్య దహన స్థలికి తీసుకెళ్లారు. 2.30 నిమిషాలకు మృతదేహాన్ని దహనం చేశారు. à°ˆ ఘటనను కవర్ చేసేందుకు మీడియా ప్రయత్నించినప్పటికీ.. ఘటనా స్థలికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ.. దహనం చేసిన ప్రదేశానికి కొద్ది దూరంలో ఉన్న యూపీ పోలీసు అధికారుల్లో ఒకరిని అక్కడ ఏం జరుగుతుందని జాతీయ మీడియాకు చెందిన à°“ రిపోర్టర్ ప్రశ్నించగా.. à°† అధికారి తనకు తెలియదని సమాధానం ఇవ్వడం కొసమెరుపు. అక్కడికి ఎవరినీ వెళ్లనీయకుండా చూడటమే తన పని అని సదరు పోలీసు చెప్పడం గమనార్హం.

 

అయితే.. కుటుంబ సభ్యుల సమక్షంలో దహనసంస్కారాలు జరగలేదన్న వార్తలను జిల్లా మేజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ లక్కర్ ఖండించారు. దహన సంస్కారాల సమయంలో కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉన్నట్లు తమ వద్ద వీడియోలు ఉన్నాయని, కుటుంబ సభ్యుల అంగీకారంతోనే అంత్యక్రియలు జరిగినట్లు ఆయన తెలిపారు. కుటుంబ సభ్యుల్లో కొందరు దహససంస్కారాల సమయంలో అక్కడే ఉన్నారని, మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని జిల్లా మేజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ లక్కర్ చెప్పారు. బాధిత యువతిపై సామూహిక అత్యాచారం కేసులో నలుగురుని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.