హత్రాస్’ యువతిపై అత్యాచారం జరగలేదు

Published: Thursday October 01, 2020

 à°¦à±‡à°¶à°µà±à°¯à°¾à°ªà±à°¤à°‚à°—à°¾ ఆగ్రహావేశాలు సృష్టించిన ‘హత్రాస్’ అత్యాచారం, హత్య కేసుపై ఉత్తర ప్రదేశ్ పోలీసులు సంచలన విషయాన్ని వెల్లడించారు. బాధితురాలిపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించినట్లు చెప్పారు. బాధితురాలి మెడపై గాయమవడంతో, తట్టుకోలేనంత స్థాయిలో ఉన్న à°† బాధ ఆమె మరణానికి కారణమైందని తెలిపారు. 

 

ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో అగ్రవర్ణానికి చెందిన నలుగురు వ్యక్తులు పందొమ్మిదేళ్ళ వయసుగల దళిత యువతిపై అత్యాచారం చేసి, తీవ్రంగా గాయపరచినట్లుగా ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె ఢిల్లీలోని à°“ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆమె అంత్యక్రియలు మంగళవారం-బుధవారం మధ్య రాత్రి జరిగాయి. పోలీసులు బాధితురాలి తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా అంత్యక్రియలు నిర్వహించారని, ఆచారాలను పట్టించుకోలేదని విమర్శలు వచ్చాయి. 

 

ఉత్తర ప్రదేశ్ అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ గురువారం మాట్లాడుతూ, దళిత యువతి మరణానికి కారణం ఆమె మెడపై తగిలిన గాయమని, à°† గాయం వల్ల ఏర్పడిన తట్టుకోలేనంత బాధ అని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించినట్లు చెప్పారు. 

‘‘ఎఫ్ఎస్ఎల్ (ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ) నివేదిక కూడా వచ్చింది. నమూనాల్లో వీర్యం లేదని à°ˆ నివేదిక స్పష్టంగా చెప్తోంది. దీనినిబట్టి అత్యాచారం లేదా సామూహిక అత్యాచారం జరగలేదని స్పష్టమవుతోంది’’ అని ప్రశాంత్ కుమార్ చెప్పారు. 

బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో కూడా అత్యాచారం గురించి పేర్కొనలేదని, తనను కొట్టడం గురించి మాత్రమే మాట్లాడిందని చెప్పారు. 

సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసేందుకు, కులపరమైన హింసను సృష్టించేందుకు కొందరు వాస్తవాలను వక్రీకరించారని చెప్పారు. ఈ కేసు దర్యాప్తులో తక్షణ చర్యలు తీసుకున్నామన్నారు. సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసేందుకు, కులపరమైన హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నించినవారిని గుర్తిస్తామని చెప్పారు. మీడియాలో కూడా వాస్తవాలను వక్రీకరించారన్నారు.