సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ది ఆత్మహత్యే

Published: Saturday October 03, 2020

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి ఆత్మహత్యే కారణమని ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడికల్ బోర్డ్ స్పష్టం చేసింది. à°ˆ మేరకు సీబీఐకి ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడికల్ బోర్డ్ నివేదికను సమర్పించింది. ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడికల్ బోర్డ్ చైర్మన్ డాక్టర్ సుధీర్ గుప్తా మాట్లాడుతూ.. ఉరి వేసుకున్నట్టు తప్ప సుశాంత్ శరీరంపై ఎలాంటి గాయాలు లేవని తెలిపారు. సుశాంత్ కుటుంబం, సుశాంత్ తండ్రి తరపు న్యాయవాది అనుమానిస్తున్నట్టుగా విషం పెట్టి గానీ, గొంతు పిసికి గానీ చంపినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవని ఐదుగురు వైద్యులతో కూడిన ఎయిమ్స్ బృందం స్పష్టం చేసింది. సుశాంత్ అనుమానాస్పద మృతి కేసును దాదాపు 45 రోజులుగా సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే.

 

 

సుశాంత్‌ది ఆత్మహత్యే అని ఎయిమ్స్ తాజాగా వెల్లడించడంపై రియా చక్రవర్తి తరపు న్యాయవాది సతీష్ మనీషిండే స్పందించారు. నిజం ఎప్పటికీ మారదని ఆయన వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర హోం మంత్రి స్పందిస్తూ.. సుశాంత్‌ది ఆత్మహత్యే అని సీబీఐ అధికారికంగా ప్రకటించే వరకూ వేచి చూద్దామని చెప్పారు. అయితే.. సుశాంత్‌ ఆత్మహత్య చేసుకుని చనిపోలేదని, గొంతు పిసికి చంపినట్లు ఆత్మహత్య సందర్భంలో సుశాంత్‌ మృతదేహం తాలూకు ఫొటోలు చూసిన ఎయిమ్స్ బృందంలోని à°“ డాక్టర్ కొన్ని నెలల క్రితం తనతో చెప్పినట్లు సుశాంత్ తండ్రి తరపు న్యాయవాది వికాస్ సింగ్ వ్యాఖ్యానించడం గమనార్హం. జూన్ 14à°¨ ముంబైలోని బాంద్రాలో ఉన్న అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో సుశాంత్(34) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే.