బెజవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం

Published: Thursday October 15, 2020

 à°¬à±†à°œà°µà°¾à°¡ వాసుల చిరకాల కోరిక నెరవేరనుంది. ఎన్నోరోజులుగా వాయిదా పడుతూ వస్తున్న కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారైంది. బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తై చాలా రోజులైంది. ప్రారంభోత్సవానికి మాత్రం అడ్డంకులు ఏర్పడుతూనే వస్తున్నాయి. ఒకసారి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ మృతితో వాయిదా పడితే.. రెండోసారి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కరోనా రావడంతో వాయిదా పడింది. ఎట్టకేలకు ఈసారి ముహూర్తం ఖరారైంది. రేపు ఉదయం 11.30 గంటలకు కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం జరగనుంది. వర్చువల్‌ ప్రారంభోత్సవం‌లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం జగన్మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. 

 

 

ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. ఫ్లైఓవర్ ప్రారంభం అయ్యాక మొదటిగా ఆర్ అండ్ బీ మంత్రి శంకర్ నారాయణ, అధికారులు ట్రావెల్ చేయనున్నారు. కనకదుర్గ ఫ్లైఓవర్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 61 కొత్త ప్రాజెక్టులు ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాలు జరగనున్నాయి. రూ.15,592 కోట్లతో అంచనాలతో 61 ప్రాజెక్టుల పనులను అధికారులు ప్రారంభించనున్నారు.