ప్రాణం తీసిన ప్రేమోన్మాదం

Published: Thursday October 15, 2020

విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇంజినీరింగ్‌ విద్యార్థిని దివ్య తేజస్విని గొంతుకోశాడు. తీవ్ర గాయాల పాలైన దివ్య తేజస్విని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కొంతకాలంగా ప్రేమ పేరుతో దివ్య తేజస్వినిని స్వామి అనే యువకుడు వేధింపులకు గురి చేశాడు. ప్రేమను నిరాకరించిందని యువతి ఇంటికి వెళ్లిన స్వామి ఆమెపై కత్తితో దాడి చేశాడు. దాడి తర్వాత కత్తితో తనను తాను గాయపర్చుకున్నాడు. మాచవరం పీఎస్‌ పరిధిలోని క్రీస్తురాజపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది.