యుద్ధానికి సిద్ధమవుతున్న చైనా దళాలు?

Published: Sunday October 18, 2020

 à°šà±ˆà°¨à°¾ దళాలు తైవాన్‌పై యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఫ్యుజియన్, గ్యాంగ్‌డాంగ్‌లలో మెరైన్ కార్ప్స్, రాకెట్ ఫోర్స్ స్థావరాలను విస్తరించినట్లు ఉపగ్రహ ఛాయా చిత్రాలు వెల్లడిస్తున్నాయి. అన్ని రాకెట్ ఫోర్స్ బ్రిగేడ్లు ప్రస్తుతం సంపూర్ణంగా సిద్ధంగా ఉన్నాయి. 

 

తైవాన్‌ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ నియంత్రణలో ఎప్పుడూ లేదు. కానీ తైవాన్ ద్వీపం తమదేనని చైనా చెప్తోంది. ఇటీవలి కాలంలో ఈస్టర్న్, సదరన్ థియేటర్ కమాండ్స్‌లోని మిసైల్ బేస్‌లలో కొన్నిటిని రెట్టింపు చేసింది. దీనినిబట్టి తైవాన్‌పై యుద్థానికి చైనా సిద్ధమవుతున్న సంకేతాలు అందుతున్నాయి. 

 

చైనా, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో హైపర్‌సోనిక్ మిసైల్‌ను మోహరించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. 

 

మరోవైపు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మంగళవారం సదరన్ ప్రావిన్స్ గ్వాంగ్‌డాంగ్‌లో పర్యటించారు. యుద్ధానికి సిద్ధమవడంపై దృష్టిపెట్టాలని దళాలను ఆదేశించారు.