‘అమరావతి మునుగుతోంది... మునిగింది

Published: Tuesday October 20, 2020

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఏరియల్‌ రివ్యూ ద్వారా వరద పరిస్థితిని సమీక్షించారు! ఎక్కడెక్కడో తెలుసా? కృష్ణా, గుంటూరు జిల్లాల్లో... కృష్ణా నదికి అటూ ఇటూ ఉన్న గ్రామాల్లో! భారీ వర్షాలతో అతలాకుతలమైన పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల వైపు మాత్రం ఆయన కన్నెత్తి చూడలేదు. దీంతో... వర్షాలు, వరదలకు భారీ నష్టం జరిగింది ఎక్కడ? సీఎం సోమవారం ఏరియల్‌ సర్వే చేసిందెక్కడ? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా.... కృష్ణా తీరం వెంట ఉన్న రాజధాని గ్రామాల పరిధిలోనే ఎక్కువగా ‘సర్వే’ జరిగినట్లు తెలుస్తోంది. ‘అమరావతి మునుగుతోంది... మునిగింది’ అని వైసీపీ నేతలు పదేపదే ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.

 

à°ˆ నేపథ్యంలో... à°† ప్రాంతంలోనే సీఎం పరిశీలన సాగించడం గమనార్హం. దీంతోపాటు నామ్‌కే వాస్తేగా మరికొన్ని ప్రాంతాలను కూడా కలిపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘అమరావతి ముంపు’ సమాచారాన్ని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు సీఎం హెలికాప్టర్‌ ఎక్కారనే అభిప్రాయం కూడా కలుగుతోంది. సమాచార శాఖ మీడియా పంపిన చిత్రాల్లో ఎక్కువ భాగం రాజధాని గ్రామాల పరిధిలోనివే కావడం గమనార్హం. అమరావతి నిర్మాణ పనుల్లో భాగంగా తవ్విన గోతులు, వేసిన మట్టికట్టల వల్ల నిలిచిన నీటిని చూపిస్తూ ‘రాజధాని మునిగిపోయింది’ అంటూ వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే! ఇప్పుడు వరద, ముంపు తీవ్రత అధికంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాలను విస్మరించి... రాజధాని మండలాల చుట్టూ రౌండ్లు వేయడంలో ఆంతర్యమేమిటనే సందేహాలు తలెత్తుతున్నాయి.