కూలిన ఇళ్లకు రూ.లక్ష పరిహారం దెబ్బ తిన్న గృహాలకు రూ.50 వేలు

Published: Tuesday October 20, 2020

భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న కుటుంబాలను ఆదుకుంటామని.. ముంపు ప్రభావానికి గురైన ప్రతి ఇంటికీ రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ప్రకటించారు. వర్షాల వల్ల ఇల్లు పూర్తిగా కూలిపోతే రూ.లక్ష, పాక్షికంగా దెబ్బతింటే రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. మంగళవారం నుంచే à°ˆ సహాయం అందిస్తామని వెల్లడించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులను బాగు చేయడానికి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని, మళ్లీ మామూలు జీవన పరిస్థితులు నెలకొనేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. పేదలకు సహాయం చేయడానికి పురపాలక శాఖకు రూ.550 కోట్లు తక్షణం విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. 

‘‘à°—à°¡à°¿à°šà°¿à°¨ వందేళ్లలో ఎన్నడూ లేనివిధంగా హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. ప్రజలు అనేక కష్టనష్టాలకు గురయ్యారు. ముఖ్యంగా నిరుపేదలు, బస్తీల్లో ఉండేవారు, లోతట్టుప్రాంతాల్లో నివసించేవారు ఎక్కువగా కష్టాల పాలయ్యారు. వారిని ఆదుకోవడం ప్రభుత్వ ప్రాథమిక విధి. కష్టాల్లో ఉన్న పేదలకు సాయం అందించడంకన్నాముఖ్యమైన బాధ్యత ప్రభుత్వానికి మరొకటి ఉండదు. అందుకే ప్రభావిత ప్రాంతాల్లోని పేదలకు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించాం’ అని సీఎం వెల్లడించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ కలెక్టర్లు, వారి బృందాలు వెంటనే రంగంలోకి దిగి.. మంగళవారం ఉదయం నుంచే ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం చేపట్టాలి’ అని సీఎం ఆదేశించారు. నగరంలో 200-250 బృందాలు ఏర్పాటు చేసి, అన్నిచోట్లా ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. 

 

పేదలకు సహాయం అందించడం అతి ముఖ్యమైన బాధ్యతగా స్వీకరించి, హైదరాబాద్‌ నగరానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్‌ అంతా భాగస్వాములు కావాలని అని సీఎం చెప్పారు. నష్టపోయిన ప్రజలు లక్షల మంది ఉన్నా సరే.. వారందరికీ సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కాబట్టి, ప్రజాప్రతినిధులంతా బాధిత కుటుంబాల వివరాలు అధికారులకు తెలియజేసి, వారికి సహాయం అందేలా చూడాలన్నారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులంతా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని, బాధితులకు à°…à°‚à°¡à°—à°¾ à°…à°‚à°¡à°—à°¾ ఉండాలని పిలుపునిచ్చారు.